ఏం కొడుకురా నాయనా.. జల్సాలకు అమ్మ డబ్బులు ఇవ్వలేదని ఇంటికి నిప్పంటించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!!

దుర్వ్యసనాలు, జల్సాలు మనుషులను ఎంత పతనానికి అయినా తీసుకువెళతాయి. చెయ్యకూడని పనులు చేయిస్తాయి. తాజాగా అటువంటి ఘటనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన గాజులరామారంలో చోటుచేసుకుంది. చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటాడు అనుకున్న కొడుకు, జల్సాలకు అలవాటుపడి కుటుంబాన్ని విస్మరించడమే కాకుండా, తల్లిదండ్రులకు భారంగా తయారయ్యాడు. అంతేకాదు అమ్మ డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఏకంగా ఇంటికే నిప్పు పెట్టాడు.

తల్లిదండ్రులకు బ్రతికుండగానే నరకం చూపిస్తున్న కొడుకు

తల్లిదండ్రులకు బ్రతికుండగానే నరకం చూపిస్తున్న కొడుకు

పున్నామ నరకం నుంచి రక్షించే వాడు పుత్రుడు అంటారు. కానీ ఇటువంటి కొడుకులు తల్లిదండ్రులు బ్రతికుండగానే నరకం చూపిస్తున్నారు. ఇక తాజాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన గాజులరామారంలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ప్రమీల, ముత్యం రెడ్డి కుమారుడు 35 సంవత్సరాల శ్రవణ్ కుమార్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని ఇంటికే నిప్పు పెట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని ఇంటికే నిప్పు పెట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్


తల్లిదండ్రులతో కలిసి గాజులరామారంలోని వీనస్ రాక్స్ హైట్స్ కాలనీలో ఇటీవలే కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఇటీవల తన ఉద్యోగం పోవడంతో జల్సాలకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా తల్లి డబ్బులు అడిగితే ఇవ్వలేదని కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంట్లో ఘడియ పెట్టుకుని గ్యాస్ లీక్ చేసిన నిప్పు అంటించుకున్నాడు. చెయ్యి కోసుకున్నాడు. డబ్బుల కోసం నానా హంగామా చేశాడు.

తల్లిని డబ్బుల కోసం వేధిస్తున్న తనయుడు.. గ్యాస్ లీక్ చేసిన ఇంటికి నిప్పు

తల్లిని డబ్బుల కోసం వేధిస్తున్న తనయుడు.. గ్యాస్ లీక్ చేసిన ఇంటికి నిప్పు

గతంలోనూ శ్రవణ్ కుమార్ రెడ్డి నాలుగుసార్లు డబ్బులు తీసుకుని ఇంటి నుంచి పారిపోయి జల్సాలు చేసి వచ్చాడు. ప్రస్తుతం కొన్ని రోజులుగా 30 లక్షలు ఇవ్వాలని తల్లిని శ్రవణ్ కుమార్ రెడ్డి వేధిస్తున్నాడు. దీంతో డబ్బులు ఇవ్వడానికి తల్లి నిరాకరించింది. ఈ క్రమంలోనే గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకున్నాడు. ఇక ఇంట్లో నుంచి మంటలు వ్యాపించడంతో పక్క ఇళ్ళలో ఉన్న స్థానికులు బయటకు పరుగులు తీశారు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది పోలీసులు ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా మంటలు దట్టంగా వ్యాపించటంతో భయపడిన శ్రవణ్ కుమార్ రెడ్డి బాత్రూంలో దాక్కున్నాడు. ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు బాత్రూంలో స్పృహతప్పి పడిపోయిన శ్రవణ్ కుమార్ రెడ్డి ని బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొత్త ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు ఘనకార్యానికి తల్లిదండ్రులు షాక్

కొత్త ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు ఘనకార్యానికి తల్లిదండ్రులు షాక్


ఇటీవలే నిర్మించుకున్న కొత్తింట్లో బిడ్డ చేసిన పని తల్లిదండ్రులను షాక్ కు గురి చేసింది. తృటిలో ప్రాణాపాయం తప్పి బయటపడిన సదరు కుమారుడు కేవలం డబ్బుల కోసం ఎటువంటి విచక్షణ లేకుండా చెయ్యి కోసుకోవడం, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పంటించటం విస్మయాన్ని కలిగిస్తోంది. బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వ్యసనాలకు బానిసై ఈ విధంగా ప్రవర్తించడం సమాజానికి హానికరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+