Vikarabad: తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి హత్య చేసిన తనయుడు.. ఎలా దొరికిపోయాడంటే..!

కొద్ది నెలల క్రితం సచివాలయంలో పని చేసే ఉద్యోగి అప్పులపాలయ్యాడు. డబ్బులు సింపుల్ గా సంపాందించాలని తన పేరు కోట్లలో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. తనలాగే ఉండే ఓ వ్యక్తిని తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తన కారులో మృతదేహాన్ని ఉంచి కారుకు మంటపెట్టాడు. ఆ తర్వాత అతను అదృశ్యమయ్యాడు. నామినీ అయిన తన భార్యకు డబ్బులు వస్తాయని అనుకున్నాడు. కానీ అనుమానించిన పోలీసులు విచారణ చేయగా అస్సలు విషయం బయటకొచ్చింది.

ఇలా చాలా మంది ఒంటరిగా ఉన్నవారికి ఇన్సూరెన్స్ చేస్తూ హత్యలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి హత్య చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. కొడంగల్ మండలంలోని బీక్య నాయక్ తండాకు చెందిన రాథోడ్ ధన్ సింగ్ కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఉపాధి కోసం తాండూరు వెళ్లాడు. మిగిలిన ఇద్దరు రవి, శ్రీనివాస్ నాయక్ తండ్రితో ఉండేవారు.

 A Son murdered his father for insurance money in vikarabad district

అయితే ధన్ సింగ్ కు చిన్న కుమారుడు రవి ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ తర్వాత తండ్రి చంపాలనుకుని ప్లాన్ వేశాడు. మంగళవారం ఉదయం తండ్రిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గేట్ వద్ద బండరాయితో తండ్రిని కొట్టి చంపాడు. ఆ తర్వాత 108కు ఫోన్ చేశాడు. రోడ్డు ప్రమాదంల గాయపడ్డామని చెప్పాడు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ధన్ సింగ్ మరణించిన వైద్యులు తెలిపారు.

 A Son murdered his father for insurance money in vikarabad district

తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రెండో కొడుకు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలో ధన్ సింగ్ రూ.50 లక్షల ప్రమాద బీమా చేయించినట్లు.. ఆ డబ్బు కోసం హత్య చేసినట్లు చెప్పాడు. పెద్ద అన్న వద్దకు వెళ్తామని చెప్పి ధన్ సింగ్ కు తీసుకెళ్లినట్లు వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+