వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరవై నాలుగో రోజుకు చేరిన సమ్మె..!హై కోర్టులో సోమవారం కీలక విచారణ..!సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారంతో ఇరవై నాలుగో రోజుకు చేరింది. ఈ 24రోజులుగా ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోవడంతో పాటు ప్రభుత్వనికి, ఆర్టీసి కార్మికులకు తెలంగాణ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. సోమవారం రోజున ఇదే సమ్మె అంశంలో మరోసారి కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె పై కోర్ట్ తీర్పు ఎలా ఉంటుంది అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో కోర్ట్ ఆదేశాల మేరకు అటు ప్రభుత్వం గాని, ఇటు ఆర్టీసి ఉద్యోగులు గాని ఏ విధంగా వ్యవహరించారు అనే అంశంపే కోర్ట్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది.

 హైకోర్ట్ తీర్పుపై ఉత్కంఠ.. ప్రభుత్వ, ఆర్టీసి వర్గాల్లో నెలకొన్న ఆసక్తి..

హైకోర్ట్ తీర్పుపై ఉత్కంఠ.. ప్రభుత్వ, ఆర్టీసి వర్గాల్లో నెలకొన్న ఆసక్తి..

ఆర్టీసీ కార్మికుల సమ్మె పిటీషన్ పై నేడు హైకోర్టు లో విచారణ జరగనున్నది. ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం మధ్య చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశం మేరకు శనివారం నాడు ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు మొక్కుబడిగానే ముగిసాయి. నిర్బంధించి తమతో చర్చలు జరిపిందని జేఏసీ ఆరోపించగా, సమావేశంలో పాల్గొన్న జేఏసీ నాయకులు తమ అభిప్రాయాన్ని తరువాత చెబుతామని వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ మొబైల్ ఫోన్లను లాక్కుని ఒక గదిలో బంధించి చర్చలు జరిపారలని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ చర్చలపై హైకోర్టు కు ప్రభుత్వం తరఫున న్యాయవాది, ఆర్టీసీ జేఏసీ తరఫున న్యాయవాది సోమవారం అందజేయనున్న వివరాల ప్రకారం కోర్ట్ స్పందిచనుంది.

 అక్రమ అరెస్టును ఖండించిన ఆర్టీసీ జెఎసీ.. సీపిఐ కి ఆర్టీసి జేఏసి సంఘీభావం..

అక్రమ అరెస్టును ఖండించిన ఆర్టీసీ జెఎసీ.. సీపిఐ కి ఆర్టీసి జేఏసి సంఘీభావం..

ఇదిలా ఉండగా సోమవారం తెల్లవారు జామున మఖ్దూమ్ భవన్ లో నిరాహారదీక్ష చేస్తున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ కు తరలించాని సీపీఐ రాష్ట్ర సమితి ఆరోపించింది. అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వందలాది మంది పోలీసులు బలవంతంగా గేటు తాళాలు పగలకొట్టి దీక్ష నిర్వహిస్తున్న సాంబశివ రావును అరెస్ట్ చేయడం జరిగింది. అప్రజాస్వామికంగా పోలీసులు అరెస్టు చేసినా కూడా నిమ్స్ లో సాంబశివరావు నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.

 దీక్ష ఆపేది లేదన్న కూనంనేని.. నిమ్స్ లో కొనసాగుతున్న దీక్ష..

దీక్ష ఆపేది లేదన్న కూనంనేని.. నిమ్స్ లో కొనసాగుతున్న దీక్ష..

అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు సీపీఐ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండుతో అక్టోబర్ 26 నుండి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మగ్ధూం భవనంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న కూనంనేని అరెస్టును ఆర్టీసీ జెఎసీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియంత మాదిరిగా రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ పరిపాలన చేస్తున్నారని, చరిత్రలో నియంతలకు పట్టిన గతే సీఎం చంద్రశేఖర్ రావుకు పడుతుందని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు.

 కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయాలి.. శ్రేణులకు పిలుపునిచ్చిన కాంగ్రెస్..

కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయాలి.. శ్రేణులకు పిలుపునిచ్చిన కాంగ్రెస్..

ఐతే ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారన్నారు. అందులో భాగంగా జేఏసీ ఇచ్చిన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సోమవారం నాడు జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి ఉందని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన అన్నారు. మున్ముందు జేఏసీ పిలుపు ఇచ్చే అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

English summary
The strike by the RTC workers reached twenty-fourth day with Monday. The Telangana High Court has made some suggestions for the government and the RTC workers, as the public transport system has been frozen for these 24 days. The trial will be held in court once again on the same strike aspect on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X