Malkajgiri: మల్కాజిగిరిలో గెలుపు ఆయనదే.. చెప్పేసిన సర్వే సంస్థ..!
లోక్ సభ ఎన్నికలు రాగానే.. ప్రధానంగా చర్చకు వచ్చే నియోజకవర్గం మల్కాజిగిరి. ఎందుకంటే.. ఇది దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ స్థానం. ఈ నియోజకవర్గంలో 31 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గెలుపొందారు. తాజాగా ఈ స్థానం నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై చర్చ మరింత ఎక్కువైంది. తాజాగా ఓ సర్వే సంస్థ మల్కాజిగిరిలో సర్వే నిర్వహించింది.
ఈటల రాజేందర్‌కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. జన్‌లోక్ పోల్ సర్వే- 2024 మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి పలు విషయాలను వివరించింది. మల్కాజిగిరిలో పార్లమంట్ స్థానంలో ఈటల రాజెందర్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. బీజేపీకి - 37.38%, కాంగ్రెస్- 35.38%, బీఆర్ఎస్- 24.93%, ఇతరులు - 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వేలో తేలినట్లు పేర్కొంది.

మల్కాజిగిరికి సంబంధించి బీజేపీ నుంచి ఈటల, బీఆర్ఎస్ నుంచి శంభీపూర్ రాజు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించ లేదు. అయితే మల్కాజిగిరిలో దేశంలోనే వివిధ రాష్ట్రాల వారు ఉంటారు. దీంతో ఇక్కడ ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువగా ఉంటుందని పొలిటికల్ విశ్లేశకులు భావిస్తున్నారు. ఇది ఈటలకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు.ఇటీవల హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లో ఈటల ఓడిపోయారు.
దీంతో ఆయనపై ప్రజల్లో సింపతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల గత కొద్ది రోజులుగా మల్కాజిగిరి కేంద్రంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. శుక్రవారం మల్కాజిగిరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. గంటన్నర పాటు 1.3 కిలోమీటర్ల దూరం ఈ రోడ్ షో ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications