టీడీపీ కార్యకర్త హత్య: కొట్టి చంపిన ఎన్డీ చంద్రన్న వర్గం సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది.రాయల భాస్కర్(55) అనే టీడీపీ కార్యకర్తను బుధవారం ఎన్డీ చంద్రన్నవర్గం హత్య చేసింది.
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో రాయల భాస్కర్(55) అనే టీడీపీ కార్యకర్తను బుధవారం ఎన్డీ చంద్రన్నవర్గం హత్య చేసింది. వివరాలిలా ఉన్నాయి.. రాయలభాస్కర్ టీడీపీ క్రీయాశీలక కార్యకర్త.
సీపీఐ ఎంఎల్ ఎన్డీ చంద్రన్న వర్గానికి సానుభూతిపరుడిగా ఉన్నాడని సమాచారం. పోడు భూములు, ట్రాక్టర్ కిరాయిల విషయంలో సమీపంలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీ గొత్తి కోయలతో వివాదాలున్నాయి.

దళ కమాండర్ రవి అతనిని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. అతను పద్ధతి మార్చుకోకపోవటంతో 10మంది దళ సభ్యులు, 10మంది గొత్తికోయలు కలిసి వెళ్లి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన పడి పోయిన భాస్కర్‌కు మంచినీళ్లు కూడా ఎవరూ పోయవద్దని హెచ్చరించారు.
గిరిజనులపై పెత్తనం చెలాయిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరికలు చేశారు. దళం సభ్యులు అక్కడ నుంచి వెళ్లిపోయి న తర్వాత గ్రామస్ధులు భాస్కర్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్దామని ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలిసి పోలీసు బలగాలు చేరుకున్నాయి. అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతున్నాయి.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications