ఉపాధ్యాయుడి అవయవాలతో ముగ్గురికి జీవనదానం
వైరాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంధం మల్లికార్జునరావు (54) బ్రెయిన్‌డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు.
ఖమ్మం: జిల్లాలోని వైరాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంధం మల్లికార్జునరావు (54) బ్రెయిన్‌డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. ఫిబ్రవరి 17 తలపోటుతో స్పృహ కోల్పోయారు.
ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మొదడు నుంచి స్పందనలు లేకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళ్ళాలని సూచించారు. అక్కడి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.

గుండె కొట్టుకుంటుండటంతో రెండు మూత్రపిండాలు, కాలేయం ఇతరులకు అమర్చవచ్చని వైద్యులు చెప్పగా.. కుటుంబ సభ్యులు అంగీకరించి తెలంగాణ జీవన్‌దాన్‌కు సమాచారం అందించారు.
ఆదివారం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం మల్లికార్జునరావు శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం సేకరించి నగరంలోని వేరే ఆసుపత్రుల్లో అత్యవసరం ఉన్న వారికి వాటిని అమర్చారు. దీంతో ముగ్గురి ప్రాణాలు నిలిచాయి.












Click it and Unblock the Notifications