హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నేనిక రాను.. నా కోసం వెతకొద్దు’: టెక్కీ ఈమెయిల్ కలకలం

హైద‌రాబాద్‌ నగరంలో రోహిత్‌ కుమార్‌(30) అనే ఓ టెక్కీ అదృశ్యం కలకలం సృష్టించింది. ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతడు అదృశ్యమయ్యాడు. తన కోసం వెతకొద్దంటూ సోదరికి ఈమెయిల్ పెట్టాడు.

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌: నగరంలో ఓ టెక్కీ అదృశ్యం కలకలం సృష్టించింది. ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

రాయదుర్గం ఎస్‌ఐ రమేష్‌ కథనం ప్రకారం.. ఖైరతాబాద్‌ ప్రాంతానికి చెందిన ఎస్‌ గణేష్‌ కుమార్‌ కుమారుడు రోహిత్‌ కుమార్‌(30) మణికొండ తానీషానగర్‌లోని సోదరి వద్ద ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

A techie missing in Raidurgam Police Station limits on Tuesday.

సోమవారం ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం తిరిగి రాలేదు. ఆమె సోదరి వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. మంగళవారం ఉదయం అతడు తన సోదరికి.. 'నా కోసం చూడకండి.. నేను ఎప్పటికీ తిరిగి ఇంటికి రాను' అనే సందేశాన్ని మెయిల్‌ చేశాడు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
A techie missing in Raidurgam Police Station limits on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X