వెయ్యి కిలో మీటర్ల నడక.!భారీ సభ.!వైయస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం.!
హైదరాబాద్: స్వల్ప విరామం అనంతరం శనివారం నుంచి వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిళ ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం కాబోతుంది. ఖమ్మంజిల్లా సత్తుపల్లి నుంచే తిరిగి 77వ రోజు పాదయాత్రను మొదలు పెట్టాలని వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 6న సత్తుపల్లి వద్ద వాయిదా పడిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర అదే సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకుంటున్నారు షర్మిల. ఈ సందర్బంగా తాళ్లమడ గ్రామంలో వెయ్యి కిలో మీటర్ల పైలాన్ వద్ద నుంచి శనివారం పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నారు షర్మిళ. శనివారం సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ కూడా నిర్వహించబతున్నారు. సభ అనంతరం తాళ్లమడ గ్రామం మీదుగా, సత్తుపల్లి టౌన్, గౌరిగూడెం, సిద్దారం మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది.

తెలంగాణలో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్వల్పవిరామం అనంతరం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 10గంటలకు రోడ్డు మార్గం ద్వార పార్టీ అధ్యక్షురాలు షర్మిళ సత్తుపల్లికి బయలు దేరతారు. సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ మైల్ స్టోన్ దాటినందుకు గుర్తుగా నిర్మించిన పైలాన్ నుంచే తమ అడుగు వేయబోతున్నారు.ముందుగా తాళ్లమడ వెయ్యి కిలో మీటర్ల పైలాన్ వద్ద బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. పునఃప్రారంభం అవుతున్న ప్రజాప్రస్థాన పాదయాత్రకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని లోటస్ పాండ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రేపు రాత్రికి వైఎస్ షర్మిల సిద్దారం గ్రామంలోనే బస చేయనున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications