టికెట్ అడిగినందుకు రైల్వే టీసీపై ఇద్దరు యువకుల దాడి
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్ప్‌ప్రెస్ రైలులో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు.
వరంగల్: రైలులో టికెట్ కలెక్టర్‌పై దాడి జరిగింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్ప్‌ప్రెస్ రైలులో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ కుమార్‌పై దాడికి పాల్పడినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపారు. కిరణ్ కుమార్ బల్లార్షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో మహబూబాబాద్‌కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్‌కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా ఎస్-1 బోగీలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు ఇద్దరు కలిసి టీసీ కిరణ్ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో టీసీకి గాయాలయ్యాయి.

రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సీటీఐ శ్రీరాం.. టీసీ కిరణ్ కుమార్ ను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన రవితేజ, సుమన్ పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, దాడి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications