అరుణాచలానికి వెళ్తూ.. రక్తమోడిన జడ్చర్ల జాతీయ రహదారి

Road accident: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం రాత్రి జడ్చర్ల సమీపంలో ఈ ఘటన సంభవించింది. జైభారత్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి బయలుదేరింది. మార్గమధ్యలో జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. జడ్చర్ల వద్ద సింధూర బార్ అండ్ రెస్టారెంట్ ఓ కారును తప్పించే క్రమంలో అదుపు తప్పింది.

A tragic accident claimed 2 lives in Telangana s Jadcherla

టైర్ పంక్చర్ కావడం వల్ల రోడ్డు పక్కన నిలిపివుంచిన ఓ కారును తప్పించబోయిన బస్సు డ్రైవర్ అదుపు తప్పి ఎదురుగా వెళ్తోన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ముందు సీట్‌లో కూర్చున్న ఓ ప్రయాణికుడు, బస్సు క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులకు గాయలయ్యాయి.

A tragic accident claimed 2 lives in Telangana s Jadcherla

బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఢీ కొట్టిన తరువాత లారీ బోల్తా పడిందంటే బస్సు వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాచారం అందుకుంట వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+