Siddipeta TTD Temple: సిద్దిపేటలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయం..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్దిపేటలో రూ.30 కోట్లతో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనుంది. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు టీటీడీ అధికారులు, ఇంజినీర్ల బృందం ఇటీవల సిద్దిపేటలో పర్యటించింది. ఆలయ డిజైన్‌ సిద్ధమైన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం హైదరాబాద్‌ నుంచి టీటీడీ ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశం మొత్తం వెంకటేశ్వరుడిని ఆరాధిస్తారని హరీశ్ రావు అన్నారు. జ

సిద్దిపేట గడ్డపై టీటీడీ ఆలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని పేర్కొన్న మంత్రి ఆలయం, గర్భగుడి డిజైన్‌పై చర్చించారు. ఈ రంగంలోని నిపుణులను సంప్రదించిన తర్వాత ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. సిద్దిపేటలో తిరుమల ఆలయ ప్రతిరూపాన్ని ఖచ్చితంగా నిర్మించాలని రావు వారికి సూచించారు. భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాకారం చుట్టూ తగినంత స్థలం వదిలివేయాలని కూడా వారిని కోరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వచ్చే శ్రావణ మాసంలో ఆలయానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కోరారు. సిద్దిపేట సమీపంలోని 6 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించనున్నారు.

temple1

అటు కరీంనగర్ లోను టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. ఇందుకోసం కరీంనగర్ లో 10 ఎకరాల భూమి కేటాయించారు. కరీంనగర్ లో వెంకటేశ్వరుని ఆలయం నిర్మాణానికి గత నెలలో మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. త్వరలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయం పూర్తి కానుంది. దీంతో ఉత్తర తెలంగాణలో వెంకటేశ్వరస్వామి ఆలయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్ హిమయత్ నగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.

టీటీడీ జమ్ములోనూ వెంకటేశ్వర ఆలయం నిర్మించింది. జమ్మూలోని ఈ గుడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మించిన ఆరో వెంకటేశ్వర ఆలయంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం మిగతా ఐదు ఆలయాలను హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్ లలో నిర్మించింది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనుంది. నెల క్రితం కరీంనగర్ లో ఆలయ నిర్మాణం చేపట్టగా.. త్వరలో సిద్దిపేటలో కూడా ఆలయా నిర్మాణం చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+