ఓ భార్య ఘాతుకం ... తాగొచ్చి తిడుతున్నాడని భర్త మర్మావయవాలు కోసేసింది
ఓ భార్య కసాయిగా మారింది. భర్త వేధింపులు తాళలేక ఎవరు చేయని పని చేసింది. తాగి ఇంటికి వచ్చి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నాడని ఏకంగా భర్త మర్మావయవాలను కోసి పారేసింది . హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన నగరవాసులను షాక్ కు గురి చేసింది.

విచక్షణ రహితంగా భర్త మర్మావయవాలను కోసిన ఉదంతంలో అసలేం జరిగిందంటే రాజస్థాన్ కి చెందిన షేర్ సింగ్(26), సంతోషిని(24) లు దంపతులు. వీరికి నాలుగేళ్లలోపు వయసుగల ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజస్థాన్ నుండి వలస వచ్చిన వారు పది రోజుల క్రితం హైదరాబాదులో మకాం పెట్టారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. షేర్ సింగ్.. ఎల్బీనగర్ లోని ఓ మార్బుల్స్ కంపెనీలో పనికి కుదిరాడు.సంతోషిని ఇంట్లో పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా పని చేసి ఇంటికి వచ్చిన షేర్ సింగ్ రాత్రి సమయంలో మద్యం సేవించి గొడవ పడ్డాడు. ఆ మద్యం మత్తులో ఏవో చిన్న కారణాలు చెప్పి భార్యను తిట్టడం మొదలుపెట్టాడు. చిన్న విషయానికి ఇంత రాద్దాంతం చేయడాన్ని తట్టుకోలేక పోయిన సంతోషిణి అంతే కోపంతో కిచెన్ లో కూరగాయాలు కోసే కత్తితో భర్తపై దాడి చేసింది.అతని మర్మాంగాలను కత్తితో కోసేసింది.
భార్య చేసిన పనికి ప్రాణాపాయస్థితికి చేరుకొని షాక్ కు గురైన భర్త తిరిగి కాస్త కోలుకొని చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి సమయంలో చిన్నారులు నిద్రలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన షేర్ సింగ్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.
తాగొచ్చి మద్యం మత్తులో భర్త తిడితేనే మర్మావయవాలు కోసేసింది అంటే ఇక పొరపాటున చెయ్యి చేసుకుంటే పైకి పంపించేది కావచ్చు అని ఈ విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆడవాళ్ళల్లో కూడా ఇలాంటి క్రూరత్వం నిండిన వాళ్ళు ఉంటారా అని ఈ సంఘటన గురించి విన్న స్థానికులు గుసగుసలాడుతున్నారు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications