భర్త ఎంత చెప్పినా విన్లేదు: ప్రియుడి వద్దకు వెళితే వివస్త్రను చేసి దారుణ హత్య

నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వివాహిత నిండు ప్రాణం బలితీసింది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వివాహిత నిండు ప్రాణం బలితీసింది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె మూడు రోజుల కిందటే హత్యకు గురైనట్లు భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ రోడ్డు నం.2కు చెందిన వ్యాపారవేత్త అంజిరెడ్డి, ప్రత్యూష(26) దంపతులు. వీరికి ఓ నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఏడాది క్రితం వ్యాపార నిమిత్తం అంజిరెడ్డి శ్రీలంక వెళ్లాడు. ఆ సమయంలో వీరి కుంటుంబంతో చనువుగా ఉండే శ్రీనివాస్‌తో ప్రత్యూషకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

A woman allegedly killed by her paramour in Hyderabad.

ఆ తర్వాత విదేశం నుంచి తిరిగి వచ్చిన అంజిరెడ్డి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను నిలదీశారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌, ప్రత్యూష మధ్య ఉన్న సంబంధంపై పెద్దల సమక్షంలో వివాదం నడిచింది. ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ప్రత్యూషను కుటుంబ పెద్దలు హెచ్చరించినా.. ఆమోలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో మూడు నెలల క్రితం అంజిరెడ్డి, ప్రత్యూష మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో జరిగినట్లు తెలిసింది. దీంతో ఆమె తన కుమార్తెను తీసుకుని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఉండే శ్రీనివాస్‌ వద్దకు వచ్చింది. తాము భార్యాభర్తలమని ఇంటి యజమానిని నమ్మించి మూడు నెలలుగా అద్దె ఇంట్లో వారు కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత వారం పాటు ప్రత్యూష ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో పుట్టింటికి వెళ్లి కూతురును అక్కడే వదిలి తిరిగి వచ్చింది.

కాగా, ఏప్రిల్ 22న రాత్రి శ్రీనివాస్‌ తన ఇంట్లోంచి బయటకు వెళ్లడాన్ని ఇరుగు పొరుగు గమనించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా.. బెడ్‌రూంలో ప్రత్యూష మృతదేహం కనిపించింది.

మృతురాలి గొంతులో కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేగాక, ఆమెను వివస్త్రను చేసి శరీరమంతా కత్తితో పొడిచిన దాఖలాలున్నాయి. కాగా, శ్రీనివాస్‌ పరారీలో ఉండటాన్ని బట్టి అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+