ప్రియుడి మోజులో పడి భర్తపై హత్యాయత్నం: అరెస్ట్

హైదరాబాద్: ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తనే తుదముట్టించేందుకు యత్నించింది. మారేడ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. సురేందర్, ప్రమీల(38) దంపతులు పికెట్‌లోని లక్ష్మీనగర్‌లో ఉంటున్నారు.

ప్రమీల మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన చిట్టిబాబు (50) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఇద్దరు సురేందర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక వేశారు. ఆదివారం రాత్రి అతడిని తన నివాసంలో ప్రమీల, ఆమె ప్రియుడు చిట్టిబాబు ఇద్దరు కలిసి సురేందర్ గొంతు నులిమి చంపబోయారు.

A woman allegedly murder attempts on her husband

బాధితుడు కేకలు వేయడంతో.. బస్తీ వాసులు అక్కడికి చేరుకునేలోపు ఇద్దరు పారిపోయారు. సురేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితులిద్దరిని అరెస్టు చేశారు.

ఎంఎంటిఎస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఎంఎంటిఎస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని(30) యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నాంపల్లి జీఆర్పీ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రకృతి చికిత్సాలయం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు నీలం, తెలుపు రంగు గీతల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+