వివాహేతర బంధం: ప్రియుడితో కలిసి భర్త మర్మాంగాన్ని కోసి దారుణ హత్య
నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలసి భర్తను దారుణంగా హత్య చేసిన నిందితురాలిని సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో హత్యకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్ మొగలయ్య మీడియాకు వివరించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పూలసెంటర్ సమీపంలోని సత్రం బజారుకు
చెందిన వీరండి పద్మ కొంత కాలంగా ఒంగోలుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి ఒంగోలుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీలో వాహనాల రికవరీ విభాగంలో పనిచేస్తున్నాడు.
కాగా, పద్మ భర్త వెంకటాచారి కూడా ఫైనాన్స్ కంపెనీకి ఏజెంటుగా పనిచేసేవారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డికి, పద్మకు పరిచయం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. భార్య పద్మ ప్రవర్తనపై అనుమానం వచ్చిన వెంకటాచారి వేధింపులకు గురిచేసేవాడు. ఎలాగైన తన భర్తను హతమార్చాలని భార్య నిర్ణయించి శ్రీనివాస్‌రెడ్డికి చెప్పి ఒప్పించింది పద్మ.

ఏప్రిల్‌లో పెద్ద కుమారుడు టెట్ పరీక్షకు వెళ్లినప్పుడు నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండు పెట్టి అదిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాలని పథకం పన్నారు. ఏదో అనారోగ్యంతో మృతిచెందినట్లు నమ్మించాలని నిర్ణయించుకున్నారు. పరీక్ష వాయిదా పడటంతో పథకం బెడిసి కొట్టింది. తిరిగి మే 22న టెట్ పరీక్ష ఉన్నందున కుమారుడు ముందు రోజే ఖమ్మం వెళ్లాడు. చిన్న కుమారుడు హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫోను చేసి సమాచారం అందించడంతో శ్రీనివాస్‌రెడ్డి, తన అల్లున్ని తోడుగా తీసుకొని మే 22న తెల్లవారు జామున సూర్యాపేటకు వచ్చారు. ఇంట్లోని పడక గదిలో నిద్రిస్తున్న వెంకటాచారి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. కండువాతో మెడ చుట్టూ చుట్టి గొంతు నులిమారు. ఆ తర్వాత కత్తితో మర్మాంగాన్ని కోసి దారణంగా హత్యచేశారు.
నేరాన్ని అంగీకరించడంతో పద్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఇన్‌స్పెక్టర్ మొగలయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications