ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం: ప్రసవం కోసం వస్తే ప్రాణం తీశారు
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఆస్పత్రిలో అందించిన వైద్యం వికటించడంతో శ్వేత(28) అనే మహిళ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌కి చెందిన శ్వేత ప్రసవం కోసం సెప్టెంబర్ నెలలో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు పెద్ద పేగు కత్తిరించారు. ఆ తర్వాత ఒక పేగుకు బదులు మరో పేగు అతికించారు.

అంతేగాకుండా కుట్లు కూడా సరిగా వేయలేదు. దీంతో ఇన్‌ఫెక్షన్ సోకి శ్వేత మరణించింది. కాగా, వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శ్వేత మరణించిందని ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications