తల, మొండెం వేరు స్త్రీ హత్య: బిడ్డను నేలకేసి కొట్టి..

వరంగల్/ మహబూబ్‌నహప్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో దారుణ సంఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రమ అనే మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు ఆమె తల, మొండెం వేరుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

A woman has been killed in Warangal district

వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్-బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు.

క్షణికావేశంలో...

క్షణికావేశంలో ఓ తల్లి కూతురు నిండు ప్రాణాన్నే బలి తీసుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో జరిగింది. శివమ్మ(23)కు రెండు సంవత్సరాల క్రితం బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన రాములుతో వివాహం జరిగింది. ఇద్దరు కూలీ నాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. శివమ్మ ఆదివారం ఉయ్యాలవాడలోని తనతల్లిగారి ఇంటికి వచ్చింది.

తన తల్లి నారమ్మ,వదినలక్ష్మి తన గురిం చి గొడవ పడడంతో శివమ్మ క్షణికావేశానికిలోనైంది. రాత్రి బాగా పొద్దు పోయినతర్వాత కూడా గొడవ అ లాగే కొనసాగుతుండడంతో శివమ్మ కోపం శివాలెత్తి నా బిడ్డ సస్తే తప్ప మీ గొడవ తీరదంటూ తన రెండున్నరేళ్ల కుమార్తె నవ్యశ్రీ కాళ్ళు పట్టి ఇంటిముదున్న సీసీ రోడ్డు కేసి బాదింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+