హైదరాబాద్‌లో ఘోరం: యువతిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు (వీడియో)
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు పైనుంచి దూసుకెళ్లడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడ చౌరస్తాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం తెలుస్తోంది. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ప్రయాణికులు ఒక్కొక్కరుగా రోడ్డు దాటుతున్నారు. అందరిలానే ఆ యువతి కూడా రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సును ఆమె గమనించలేదు.

చివరకు చేయి పైకెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేసేలోపే ఆమెపై నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ యువతి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ముందున్న యువతిని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆమె పైనుంచి బస్సును తీసుకెళ్లడంతోనే ఈ ఘోరం జరిగింది.
A RTC bus ran over on a young woman killing her in the spot. The incident reported at Kothaguda circle in Madhapur, #Hyderabad. Victim woman was trying to cross the road, meanwhile RTC bus coming from another direction ran over her after driver didn’t see her crossing the road. pic.twitter.com/QdJQa8cdAx
— Sowmith Yakkati (@YakkatiSowmith) September 14, 2024
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడున్నవారు వారించినా వినకుండా దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలు కొందరు వీడియో తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. ఈ విషయాన్ని స్థానికులు గమనించి దూకవద్దంటూ కేకలు వేశారు. వారు తెరుకునే లోపు ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది.
వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్లు సమాచారం. కాగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఎవరితో ఏం మాట్లాడింది అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications