పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై రేప్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..భవానీనగర్ ప్రాంతానికి చెందిన యువతి(22)కి ఇంటి పక్కనే నివాసముండే గులాం మహ్మద్ ముర్తుజా నాలుగేళ్ల క్రితం పరిచయమయ్యాడు.
ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. మూడు నెలల కిందట మరో మహిళతో వివాహం చేసుకుంటున్నానని చెప్పి.. ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.

పెళ్లి చేసుకోకుండా మెసం చేసిన మహ్మద్ ముర్తుజా పై ఫిబ్రవరి 7న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతడ్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. విదేశాల్లో ఉంటున్న ముర్తుజా సోదరుడు పాతనగరంలోని కొందరు నాయకుల అండదండలతో బాధితురాలి ఇంటికి వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. వారి ఇల్లు ఖాళీ చేయించాడు.
పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయిందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు వేడుకుంటోంది. మహిళలపై పైశాచిక దాడులు జరుగుతున్నా పాతనగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని పీయూసీఎల్ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు జయవింధ్యాల ఆరోపించారు. ప్రేమించిన పాపానికి ఇంటిని ఖాళీ చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications