మాయమాటలు చెప్పి బాలికపై రేప్: నిర్భయ కేసు

హైదరాబాద్: మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాధిత బాలిక(13) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది.

నెల రోజుల క్రితం బాలిక ట్యూషన్‌కు వెళ్తుండగా.. ట్యూషన్ టీచర్ ఇంటిపక్కనే అద్దెకు ఉండే కృష్ణ(24) ఆమెకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

A Youth allegedly raped minor girl

మరో రెండు సార్లు కూడా ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని బాలికను బెదిరింపులకు గురిచేశాడు. కాగా, బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి ఆమెను గట్టిగా అడగ్గా.. జరిగిన విషయం చెప్పింది.

దీంతో బాలిక తల్లి బుధవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీనులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. కాగా, కృష్ణ ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లితో కలిసి సహజీవనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+