హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభయ్ హత్య కేసులో పురోగతి: బీహారీ డ్రైవర్ కీలక పాత్ర?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాపారి రాజ్‌కుమార్ కుమారుడు అభయ్‌ని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అభయ్ కిడ్నాప్, హత్య సంఘటలో బీహారీ వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన శేషుతో పాటు బీహార్‌కు చెందిన లల్లన్ తివారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లల్లన్ తివారీ బీహార్‌కు చెందినవాడు.

Abhay murder case: Driver is the key person?

తివారీ ఏడాదిన్నర కాలంగా రాజ్‌కుమార్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్‌ని కిడ్నాప్ చేసిన తర్వాత తివారీ సాయికి సమాచారం అందిస్తూ వచ్చాడని పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్, పోలీసుల కదలికలను సాయికి తివారీ అందిస్తూ వచ్చాడని అంటున్నారు.

అభయ్‌ని హత్య చేసిన తర్వాత నిందితులు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడిన విషయం తెలిసిందే. పది కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్ ఆ తర్వాత ఐదు కోట్ల రూపాయలకు దిగి వచ్చాడు.

English summary
Hyderabad police have identified Rajkumar's driver Lallan tiwary was the key person in Abhay kidnap and murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X