సైనా నెహ్వాల్‌పై అనుచిత వ్యాఖ్యలు: నటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
హైదరాబాద్: సినీనటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేసిన ఓ ట్వీట్‌కు స్పందిస్తూ.. సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్‌పై సామాజిక కార్యకర్త ప్రేరణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సిద్ధార్థ్‌పై సెక్షన్ 67యాక్ట్, ఐసీపీ 509 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడం, నలువైపుల నుంచి విమర్శలు రావడంతో సిద్ధార్థ్ బుధవారం సైనాకు క్షమాపణలు తెలిపారు.

తాను కేవలం జోక్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్ చేశానని సిద్ధార్థ్ తెలిపారు. అయితే, ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉన్నందున తాను క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. సైనా నెహ్వాల్ ఎప్పటికీ మన ఛాంపియనే అంటూ ట్విట్టర్ వేదికగా ఆమెకు ఓ లేఖ రాశారు.
సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్... అంటూ సైనా పై చేసిన వ్యాఖ్యలపై అనేక మంది ప్రముఖులు స్పందిస్తూ సిద్దార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు, జాతీయ మహిళా కమిషన్, క్రీడాకారులు, చిన్మయి, సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్ద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సిద్ధార్థ్ తను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ వివరించే ప్రయత్నం చేశారు. సైనాకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో సిద్దార్థ్ తాజా ట్వీట్‌పై సైనా స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
'మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను' అని సైనా పేర్కొన్నారు. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి' అని హుందాతనాన్ని చాటుకున్నారు సైనా. ,కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం విదితమే. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications