రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు: హైకోర్టులో ఎసిబి వాదన ఇదీ...
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) లిఖితపూర్వక కౌంటర్‌ను దాఖలు చేసింది. రేవంత్ బె యిల్ పిటిషన్‌పై అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ ఆయన వాదించారు. అయినా, రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఇద్దరు నిందితులకు కూడా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌తోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి రేవంత్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు తరలివచ్చారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ ఎసిబి ఇలా వాదించింది.

మొదట మత్తయ్యే నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌ను సంప్రదించారని, మత్తయ్య రూ. 2కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టారని ఎసిబి తరఫున ఎజి రామకృష్ణా రెడ్డి ఎసిబి తరఫున వాదన వినిపిస్తూ అన్నారు. ఈ కేసులో మత్తయ్య సహా మరికొందరిని విచారించాల్సి ఉందని చెప్పారు.
బెయిల్ ఇస్తే రేవంత్ రెడ్డి ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇంకా తేలాల్సి ఉందని ఆయన అన్నారు. అయినా, రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికే హైకోర్టు సిద్ధపడింది.












Click it and Unblock the Notifications