హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప: లంచాన్నీ పంచాడు!(పిక్చర్స్)

ఓ ఉద్యోగి డెప్యుటేషన్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేందుకు లంచం తీసుకుంటూ అదనపు సంచాలకుడితోపాటు అతడి డ్రైవర్‌, అటెండర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ ఉద్యోగి డెప్యుటేషన్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేందుకు లంచం తీసుకుంటూ అదనపు సంచాలకుడితోపాటు అతడి డ్రైవర్‌, అటెండర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

అరెస్ట్ చేసిన ఏసీబీ

అరెస్ట్ చేసిన ఏసీబీ

తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు (అడ్మిన్‌-1) ఎం సంజీవరావు, ఇద్దరు కింది స్థాయి సిబ్బందిని మంగళవారం అరెస్టుచేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ సిటీ రేంజ్‌-1 డీఎస్‌పీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

డిప్యూటేషన్ చేస్తే లంచం

డిప్యూటేషన్ చేస్తే లంచం

వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా దామెర పీహెచ్‌సీలో శైలజ ఫార్మసిస్టుగా పని చేస్తున్నారు. వరంగల్‌లో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌కు డెప్యుటేషన్‌పై వెళ్లేందుకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయంలో ఆమె అర్జీ పెట్టారు. దీన్ని కమిటీ అనుమతించింది.

లంచం డిమాండ్

లంచం డిమాండ్

అయితే, ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏడీ సంజీవరావు రూ.12 వేలు, అతని డ్రైవర్‌ తౌఫీక్‌ రూ.3 వేలు, అటెండర్‌ షేక్‌ అంబర్‌బాబా రూ.2 వేలు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై శైలజ సోదరుడు రజనీకాంత్‌ జనవరి 16న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనమేరకు మంగళవారం రజనీకాంత్‌ డబ్బులు ఇచ్చేందుకు ఏడీ సంజీవరావును కలిశారు.

 పట్టేశారు

పట్టేశారు

సొమ్మును డ్రైవర్‌కు ఇవ్వవలసిందిగా అతడు చెప్పడంతో డ్రైవర్‌ తౌఫీక్‌కు రూ.15 వేలు, అటెండర్‌కు రూ.2వేలు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ సీటీ రేంజ్‌-1 డీఎస్‌పీ అశోక్‌కుమార్‌ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు.

English summary
ACB arrested Additional director in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X