లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన అవినీతి అధికారి
హైదరాబాద్: అవినీతికి పాల్పడిన ఓ ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసాచారి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురానికి చెందిన బానోత్ బాలాజీ నాయక్‌కు కొంత భూమి ఉంది. అది ప్రభుత్వానికి చెందిన భూమిగా గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో బాలాజీ నాయక్ తనకు అనుకూలంగా నివేదిక తయారు చేయాలని సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసాచారి సహాయం కోరాడు.

అందుకు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసాచారి తొలుత రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే అంత పెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని రూ. లక్ష వరకు ఇచ్చుకోగలలని చెప్పాడు. గురువారం నాడు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసాచారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గతంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ వారు గత కొంతకాలం నుంచి నిఘాపెట్టారు. అదుపులోకి తీసుకుని ఆయనపై విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications