రూ.250 కోట్లు: టీడీపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎర ఇలా! (పిక్చర్స్)
హైదరాబాద్: టీడీపీ పైన తెరాస ఆరు నెలలుగా కుట్ర చేస్తోందని ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం ఆరోపించారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఏసీబీ అధికారులను కలిసి తమను బెదిరిస్తున్నారని, డబ్బు ఆశ చూపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.
తుమ్మల నాగేశ్వర రావుతో ప్రలోభాలు మొదలు పెట్టారని ఎర్రబెల్లి అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి కేసీఆర్ మూడుసార్లు వెళ్లారని, ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. తలసాని ఇంటికెళ్లి కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేసింది నిజం కాదా చెప్పాలని ప్రశ్నించారు.
పార్టీ మారకుంటే నియోజకవర్గానికి నిధులు ఇవ్వమని బెదిరిస్తున్నారు. పార్టీలోకి వస్తే పదవులు, డబ్బు ఇస్తామని చెబుతున్నారని, లేదంటే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

తెలంగాణ టీడీపీ
తనకు మంత్రి పదవి ఇస్తానని, మీరూ వస్తే కార్పోరేషన్ పదవి ఇస్తామని కేసీఆర్ తనకు చెబుతున్నారని తలసాని టీడీపీలో ఉన్నప్పుడు తమతో చెప్పారన్నారు. తుమ్మల నాగేశ్వర రావు, ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరం కృష్ణారావుల పైన కూడా ఇలాగే ఒత్తిడి తెచ్చారన్నారు.

తెలంగాణ టీడీపీ
ధర్మారెడ్డి టీడీపీ నుంచి తెరాసలో చేరిన తర్వాత అక్కడి నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ.. తనకు రూ.250 కోట్ల కాంట్రాక్టు, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని ఆశపెట్టారని స్వయంగా చెప్పినట్లు మీడియాలో కూడా వచ్చిందన్నారు.

తెలంగాణ టీడీపీ
తన ఆర్థిక ఇబ్బందులు తీరుస్తానంటే తాను తెరాసలోకి వెళ్తున్నానని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారని, సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి వెళ్తున్నట్లు తీగల చెప్పారని తెలిపారు. కృష్ణారవును కేసీఆర్ ఫాంహౌస్‌కు పిలిపించుకొని ఎస్కార్టుతో ఇంటికి కారులో ఏం పెట్టి పంపించారో విచారణ చేయాలన్నారు.

తెలంగాణ టీడీపీ
టీడీపీ ఎమ్మెల్యేలను ఏవిధంగా ఇబ్బంది పెట్టారన్న దాని పైన పూర్తి విచారణ జరిపితే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లు జైలుకు పెతారన్నారు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని వారు చెప్పారు.

వేం నరేందర్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసులో విచారించేందుకు తమ ముందు హాజరు కావాల్సిందిగా ఏసీబీ ఆదేశించడంతో ఈరోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి ఆయన వెళ్లారు.

వేం నరేందర్ రెడ్డి
ఉదయం 11 గంటల నుంచి ఆయన్ని నాలుగైదు గంటల పాటు ఏసీబీ విచారంచింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఏసీబీ అధికారులు ఆయన్ని సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

వేం నరేందర్ రెడ్డి
ఏసీబీ విచారించిన అనంతరం వేం నరేందర్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు.












Click it and Unblock the Notifications