ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయితీ రాజ్ డీఈఈ: ఆస్తులు కోట్లలో(ఫోటోలు)

హైదరాబాద్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో పంచాయితీ రాజ్ శాఖ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న వాకిటి రవీంద్రనాథ్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. బన్సీలాల్ పేట్‌ డివిజన్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఆయన నివాసంలో డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

పలు కీలకమైన పత్రాలు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో రవీంద్రనాథ్ ఇంటికి వచ్చిన అధికారులు మధ్యాహ్నాం వరకు సోదాలు చేపట్టారు. అక్రమంగా సంపాదించిన 40 తులాల బంగారం, కిలో వెండి, సుమారు నాలుగు కోట్ల విలువ చేసే అక్రమ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయితీ రాజ్ డీఈఈ

ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయితీ రాజ్ డీఈఈ

గతంలో సిద్ధిపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో పని చేసిన రవీంద్రనాథ్ రోడ్ల నిర్మాణ పనులలో అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయితీ రాజ్ డీఈఈ

ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయితీ రాజ్ డీఈఈ

బీబీనగర్‌లో మూడు ప్లాట్స్, శంషాబాద్‌లో ఐదు వందల గజాల స్ధలం, గాంధీనగర్‌లో రెండు అపార్ట్‌మెంట్‌లు అక్రమంగా సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు.

 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

మరోవైపు రూ. 2500 లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కాడు ఓ వీఆర్వో. సలీంనగర్‌కు చెందిన మాటూరి అశోక్ మూగ, చెవిటి వికలాంగుడు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకు ఆసరా పింఛను మంజూరు చేయాలంటూ రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

అశోక్ అతని సమీప బంధువు అంజయ్యతో కలిసి వీఆర్‌వో రామ్‌కుమార్‌నాయక్‌ను అడిగారు. పింఛన్ మంజూరు కావాలంటే రూ. మూడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న రూ. 500 ఇచ్చి, మిగతా రూ. 2,500లను మూడు రోజుల్లో ఇస్తామని చెప్పి వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మిగతా డబ్బు ఇస్తున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి వీఆర్వోను పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+