ఫార్ములా ఈ - కార్ రేసులో అనూహ్య పరిణామం, ఏసీబీ నెక్స్ట్ ఇక..!!

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. గవర్నర్ కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతించారు. తాజాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏసీబీ మరో రెండు రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందని తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు కేటీఆర్, అరవింద కుమార్ విషయంలో ఏసీబీ తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఒకటి రెండు రోజుల్లొనే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ గురించి ఏం తేల్చబోతున్నారనేది కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసు విచారణ దాదాపు పూర్తి చేసామని చెబుతున్న అధికారులు.. న్యాయస్ధానంలో చార్జిషీట్‌ దాఖలు చేయడమే తరువాయి అని ఉన్నతాధికారులు తెలిపారు. చార్జిషీట్‌కు ఇప్పటికే తుదిరూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు.. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోసం ఆగారు. తాజాగా డీవోపీటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రావడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి తెలియజేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఈ వారంలో చార్జిషీట్‌ దాఖలుకు కావాల్సిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు కీలకమైన పలు ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ సాక్ష్యాధారాలను సేకరించారు.

acb-to-file-charge-sheet-against-k-t-rama-rao-in-formula-e-race-case-here-the-details

కోర్టులో ఛార్జ్ షీట్ పైన కొనసాగుతున్న ఉత్కంఠ

కాగా, ఫార్ములా ఈ-కారు రేసు వల్ల హెచ్‌ఎండీఏకు రూ.75.88 కోట్ల నష్టం జరిగిందనే అంశాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు రావడం క్విడ్‌ ప్రొకోలో భాగమేనన్న విషయాన్ని చార్జిషీట్‌లో ఏసీబీ అధికారులు పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గతేడాది నవంబరులో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి 2024 డిసెంబరు 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి, కేటీఆర్‌లను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించారు. చార్జిషీట్‌లో ఇతరులకు లాభం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొనబోతున్నట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+