సాగర్ కాలువలో బయటపడ్డ 6 మృతదేహాలు
సూర్యాపేట్ జిల్లాలోని సాగర్ కాల్వలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. వాహనం తోపాటు అందులో చిక్కుకున్న ఆరుగురి మృతదేహాను లభ్యమయ్యాయి. సంఘటన జరిగిన సుమారు 15గంటల తర్వాత క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అయితే కాలువలో వదర ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహానాన్ని వెలికి తీసేందుకు ఆలస్యమైనట్టు జిల్లా అధికారులు తెలిపారు.
కాగా ఒక్కసారిగా ఆరుమృతదేహాలు బయట పడడంతో రాత్రి నుండి అక్కడే ఉన్న కుటుంభ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హైదరారాబాద్‌లోని ఈసీఐఎల్‌లోని అంకుర ప్రవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తమ స్నేహితుడి పెళ్లికి హజరై శుక్రవారం రాత్రి తిరుగుప్రయాణం అయిన సంధర్బంలోనే దుర్ఘటన జరిగింది.
ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకుపోవడంతో వాహనంలో ఉన్న ఆరుగురు యువకులు ప్రాణాలు విడిచారు. అయితే ఆ కారు వెనకాలే వస్తున్న ఇతర స్నేహితులు కారు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

కాగా ప్రమాదా సంఘటన జరిగిన స్థలానికి సూర్యపేట జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్‌తో పాటు జిల్లా భాస్కరన్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారు. మృతులను స్థానిక సూర్యపేట్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంభసభ్యులకు అప్పగించనున్నారు.












Click it and Unblock the Notifications