Vamsikrishna: ఆపరేషన్ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే.. తల్లీబిడ్డలు క్షేమం..
ప్రస్తుతం అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టిన వారిలో డాక్టర్లు కూడా ఉన్నారు. అయితే వారు ఎమ్మెల్యేలు అయినా వారి వృత్తిని మాత్రం మారిచిపోలేదు. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. సిజేరియన్ చేసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడి వైద్యవృత్తికే వన్నె తెచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకు తొమ్మిది నెలలు నిండినా డెలివరీ కాకపోవడంతో ఆమె బంధువులు అచ్చంపేటలోని ఆస్పతికి తీసుకొచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా దవాఖానకు వెళ్లాలని అక్కడి సిబ్బంది చెప్పడంతో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి అచ్చంపేటలో ఉన్న ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వెంటనే ఎమ్మెల్యే సదరు గర్భిణిని అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి అక్కడి వైద్యులతో కలిసి సిజేరియన్ నిర్వహించారు. ఆడపిల్ల జన్మించగా తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు.

వంశీకృష్ణ ఎమ్మెల్యే కాకముందు సర్జన్ గా మంచి పేరు ఉంది. ఆయన అచ్చంపేట, హైదరాబాద్, కల్వకుర్తిలో ప్రాక్టీస్ చేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. కాగా ప్రస్తుత అసెంబ్లీలో అడుగుపెట్టిన డాక్టర్లలో వంశీకృష్ణతో పాటు కవ్వంపల్లి సత్యనారాణ కూడా ఉన్నారు.


గత అసెంబ్లీలో స్టేషన్ ఘన్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చిన్న పిల్లల వైద్య నిపుణులుగా ఉన్నారు.వైద్యులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని వైద్య శాఖ సలహదారులుగా నియమిస్తే బాగుటుందని పలువులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications