తమ్ముడి కుటుంబంపై యాసిడ్ తో దాడి చేసిన అన్న, ఎందుకంటే?

కుటుంబ కలహలతో స్వంత తమ్ముడి కుటుంబంపై సోదరుడే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సోదరుడి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మందమర్రి:కుటుంబ కలహలతో స్వంత సోదరుడి కుటుబంపై సోదరుడే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సోదరుడు ఆయన భార్య ఈ ప్రమాదం నుండి తప్పించుకోగా, వారిద్దరు పిల్లలు యాసిడ్ దాడికి గురయ్యారు.మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

మంచిర్యాల జిల్లాలోని మందమర్రికి చెందిన సిరికొండ సమ్మయ్య రమాదేవిని 14 ఏళ్ళ క్రితం ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. అయితే ఈ ప్రేమ వివాహం ఆ కుటుంబానికి ఇష్టం లేదు.

ఈ ప్రేమ వివాహం కారణంగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.అయితే సమ్మయ్య తల్లి ఇటీవల మరణించింది. దీంతో ఈ గొడవలు మరింత ఎక్కువయ్యాయి.ఈ గొడవలతో శనివారం నాడు సమ్మయ్య సోదరుడు సదానందం అక్క సునీత, ఆడపడుచులు పద్మ, తిరమల, మామ మల్లయ్యలు రమాదేవిపై దాడికి పాల్పడ్డారు.

acid attack on family at manchiryal

ఈ విషయాన్ని తెలుసుకొని ఇంటికి వచ్చిన సమ్మయ్యపై కూడ వారు దాడికి పాల్పడ్డారు. తనతో పాటు తన భార్యపై తన సోదరుడు, తండ్రితో పాటు కొందరు దాడికి పాల్పడ్డారనే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకుగాను సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా సదానందం యాసిడ్ తో దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో సమ్మయ్య , ఆయన భార్య ఈ దాడి నుండి తప్పించుకోగా, వారిద్దరి పిల్లలు అనూష్, సంగీత్ లపై యాసిడ్ పడింది. ఈ ప్రమాదంలో పిల్లలద్దరిని మందమర్రి ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి , ఆనంతరం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+