కెసిఆర్‌ను కలిసిన నాగార్జున, ఎందుకంటే?: చైతూ-సమంత పెళ్లిపై ఆరా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సోదరుడు అక్కినేని వెంకట్‌లు ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.

నంద్యాల ఎఫెక్ట్: కెసిఆర్ పాత అస్త్రం, ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు

మర్యాదపూర్వక భేటీ అని

మర్యాదపూర్వక భేటీ అని

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో కంటి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన కంటి సర్జరీ నేపథ్యంలో అక్కినేని సోదరులు.. ముఖ్యమంత్రిని కలిసి, ఆయన హెల్త్ విషయమై ఆరా తీశారు. కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని తెలుస్తోంది.

ఫిలిం స్టూడియోలపై చర్చ

ఫిలిం స్టూడియోలపై చర్చ

ఇదే సమయంలో హైదరాబాదులో సినిమా పరిశ్రమను మరింత ప్రోత్సహించే అంశంపై నాగార్జున, కేసీఆర్ మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరిన్ని ఫిలిం స్టూడియోల నిర్మాణం, గ్రాఫిక్ డిజైన్ ఇండస్ట్రీ ప్రమోషన్ తదితరాల అంశాలపై చర్చించారని తెలుస్తోంది.

నాగచైతన్య పెళ్లి ఏర్పాట్ల గురించి కేసీఆర్ ఆరా

నాగచైతన్య పెళ్లి ఏర్పాట్ల గురించి కేసీఆర్ ఆరా

నటి సమంతతో నాగార్జున తనయుడు నాగచైతన్య వివాహం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కేసీఆర్ ఆరా తీశారని తెలుస్తోంది. ఈ నెలలోనే గోవాలో పెళ్లి జరగనుంది.

 ఎన్ కన్వెన్షన్‌తో పతాక శీర్షికలకు

ఎన్ కన్వెన్షన్‌తో పతాక శీర్షికలకు

కాగా, గతంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన నోటీసుల సమయంలో నాగార్జున - కెసిఆర్ పేరు పతాక శీర్షికలకు ఎక్కిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Film hero Nagarjuna and his elder brother Akkineni Venkat called on Telangana Chief Minister K Chandrasekhar Rao at the latter's residence Pragathi Bhavan. They inquired the health condition of KCR as he underwent eye surgery in New Delhi two days ago.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి