శ్రీమంతుడైన ప్రకాష్ రాజ్: నిన్న దత్తత, నేడు పర్యటిస్తున్నారు (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లెలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పర్యటిస్తున్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు సోమవారం ప్రకటించిన ఆయన తదుపరి రోజే అక్కడికి వెళ్లడం గమనార్హం. ఈ క్రమంలో గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు.
అంతేగాక గ్రామంలోని పలు సమస్యలపై అక్కడి వారిని అడిగి తెలుసుకోనున్నారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమై సామాజిక బాధ్యతలో భాగంగా ప్రకాశ్ రాజ్ కొండారెడ్డి పల్లెని దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.
ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే కర్ణాటకలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్‌కు వివరించారు. అదే విధంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని తెలిపారు. కొండారెడ్డిపల్లెలో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నానని చెప్పారు.
తాను నివసిస్తున్న గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి రైతులకు సాయం అందించేందుకు, గ్రామంలో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే తన సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని, అది ముగియగానే గ్రామంలో చేపట్టే పనుల వివరాలు వెల్లడిస్తానని ప్రకాశ్‌రాజ్ తెలిపారు.

కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటా: ప్రకాష్ రాజ్
గ్రామాన్ని దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్న హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లను ప్రకాశ్‌రాజ్‌తో మాట్లాడించి, ఆయనకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరారు.

కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటా: ప్రకాష్ రాజ్
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కోసం పనులను నిర్ణయించేందుకు కొండారెడ్డిపల్లె గ్రామస్థులతో సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై కొండారెడ్డిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు. ప్రకాశ్‌రాజ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటా: ప్రకాష్ రాజ్
మంగళవారం ఉదయం 10గంటలకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కలెక్టర్ శ్రీదేవి గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తారని ప్రకాశ్‌రాజ్ అభిమానులు తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామ జనాభా 2,500కాగా, 1,460మంది ఓటర్లు ఉన్నారు. మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల చేరువలో ఉన్నప్పటికీ గ్రామంలో మౌలికవసతులు అధ్వాన్నంగా ఉన్నాయి.

కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటా: ప్రకాష్ రాజ్
చిరుజల్లులు కురిసినా వీధులన్నీ చిత్తడిగా మారిపోతాయి. మురుగుకాల్వలు లేకపోవటంతో ఇండ్లలో నుంచి వచ్చే నీటితోపాటు వర్షపునీరు కూడా వీధుల్లోనే నిలుస్తున్నది. గ్రామానికి నీరందించే బోర్లు వట్టిపోవటంతో మంచినీటి సరఫరా ప్రధాన సమస్యగా మారింది. రవాణా సౌకర్యాలు కూడా లేకపోవటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటా: ప్రకాష్ రాజ్
కేశంపేట జెడ్పీటీసీ సభ్యుడు పల్లె నర్సింగ్‌రావు మాట్లాడుతూ సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించే ప్రకాశ్‌రాజ్ నిజజీవితంలో మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం మా గ్రామస్థులందరి అదృష్టమన్నారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న చిన్న గ్రామ పంచాయతీకి తగిన నిధులు ఇస్తారని, నిధులకంటే ముఖ్యంగా మంచి నిర్ణయంతో గ్రామస్థులందరికీ ప్రకాశ్‌రాజ్ స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తున్నామన్నారు.

కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటా: ప్రకాష్ రాజ్
కొత్తపేట పీఏసీఎస్ అధ్యక్షుడు టీ శంకర్ మాట్లాడుతూ గ్రామజ్యోతి స్ఫూర్తితో మా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సంకల్పానికి అనుగుణంగా గ్రామస్థుందరినీ ఏకం చేసి గ్రామాభివృద్ధికి పాటుపడతామన్నారు. ప్రధానంగా గ్రామంలో కొరవడిన మౌలిక సౌకర్యాల కల్పనకు ఇదే అదనుగా పనిచేస్తామన్నారు.












Click it and Unblock the Notifications