టీ మంత్రి ఇంటికి నటి రజని, స్కూల్‌పై ఫిర్యాదు

కాగా, దూలపల్లి సమీపంలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఆ పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపిస్తూ రజని పది రోజుల క్రితం బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆమె ఫిర్యాదు ప్రకారం తన పెద్ద కుమారుడు అజయ్ ఇదే స్కూలులో పదో తరగతి చదువుతున్నాడని, స్కూలు వారి మానసిక వేధింపులు తాళలేక మానివేశాడన్నారు. 7వ తరగతి చదువుతున్న కూతురు రికితను అక్టోబర్ 28న తరగతి టీచర్ అకారణంగా చెంప దెబ్బలు కొట్టారని ఆరోపించారు.
ఈ విషయమై అదే రోజు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదే పాఠశాలలో 5వ తరగతి చదవుతున్న తన చిన్న కుమారుడు ధనుష్ అక్టోబర్ 31న బస్సులో అటు ఇటూ తిరుగుతున్నాడని ఇంగ్లీష్ టీచర్ వేధించారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా పాఠశాల యాజమాన్యం తన పిల్లల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications