బీజేపీలోకి దివ్యవాణీ - ముహూర్తం ఫిక్స్..!!

సినీ నటి దివ్యవాణీ రాజకీయంగా మరోపార్టీలో చేరిక ఖాయమైంది. టీడీపీలో పని చేసి రాజీనామా చేసిన దివ్యవాణీ ఇప్పుడు బీజేపీలో చేరేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. తెలంగాణ లో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దివ్య వాణీ సమావేశమయ్యారు. పార్టీలో చేరిక పైన చర్చించారు. అయితే, పార్టీలో ఏ రకంగా దివ్య వాణీ సేవలు వినియోగించుకోవాలనే అంశంతో పాటుగా పార్టీలో బాధ్యతల పైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజేందర్ స్పష్టం చేసారు.

దివ్యవాణీ తమిళ - కన్నడ ప్రాంతాలతోనూ సంబంధాలు ఉండటంతో.. పార్టీ ప్రచారానికి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడుతోందని.. త్వరలోనే తాను పార్టీలో చేరే అంశం పైన అన్నీ చెబుతానని దివ్యవాణీ చెప్పుకొచ్చారు. అయితే, ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

ఆయన సమక్షంలో కొందరు పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే దివ్యవాణీ సైతం కాషాయం కండువా కప్పుకొనే ఛాన్స్ ఉందని సమాచారం. టీడీపీలో పని చేసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా దివ్యవాణీ అనేక ఆరోపణలు..విమర్శలు చేసారు.

Actress Divyavani meets Etela, expresses interest to join in BJP

అయితే, మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం పైన దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన సమయంలోనూ తన ఆవేదన వినేందుకు సమయం ఇవ్వలేదని వాపోయారు. పార్టీలో కొందరు నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన దివ్య వాణీ..టీడీపీకి రాజీనామా చేసారు. ఆ తరువాత బీజేపీలో చేరికకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్వరలోనే బండి సంజయ్ తోనూ దివ్య వాణీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో దివ్య వాణీ పార్టీలో చేరిక ముహూర్తం ఫైనల్ అవుతుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+