టాలీవుడ్ హీరోయిన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్: థర్డ్ స్టేజ్: వంశపారంపర్యంగా: లొంగే ప్రసక్తే లేదు..
హైదరాబాద్: ప్రముఖ నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. థర్డ్ స్టేజీలో ఉన్నారు. గ్రేడ్-3 ఇన్వాసివ్ కార్సినోమాకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన లేటెస్ట్ ఫొటోను జత చేశారు. కీమో థెరపీ చేయించుకునే సమయంలో సాధారణంగా శిరోముండనం చేయిచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తొమ్మిది సైకిల్స్ కీమో థెరపీ పూర్తయింది. ఇంకా ఏడుసార్లు కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి సన్నద్ధమౌతున్నట్లు చెప్పారు.

పుణెలో ట్రీట్‌మెంట్..
హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినట్లు నాలుగు నెలల కిందట డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె పుణెలో ఉంటున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా 16 సైకిల్స్ కీమోథెరపీని చేయించుకోవాల్సి ఉంటుందని, ఇందులో తొమ్మిది పూర్తయ్యాయని హంసానందిని తెలిపారు. ఇంకా సగం ప్రయాణం మిగిలివుందని, దీనికోసం శారీరకంగా, మానసికంగా సన్నద్ధమౌతున్నట్లు చెప్పారు. ఓ భావోద్వేగ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
వంశపారంపర్యంగా..
తన కుటుంబంలో క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తోందని, తన తల్లి దీని బారిన పడి కన్నుమూశారని హంసానందిని చెప్పారు. తన శరీరంలో క్యాన్సర్‌కు సంబంధించిన జెనెటిక్ మ్యూటేషన్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారని అన్నారు. ఇప్పుడు ఈ చికిత్స వల్ల కేన్సర్్ నుంచి బయటపడినప్పటికీ.. మళ్లీ తలెత్తడానికి 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని తేలిందని చెప్పారు. తన జీవితం తన చేతుల్లో ఉందని, క్యాన్సర్‌కు తాను లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ తాను మునుపటిలా కనిపిస్తానని చెప్పారు.

ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు..
క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారని, వారందరి స్ఫూర్తితో చివరి క్షణం వరకూ పోరాడతానని అన్నారు. ఈ అనారోగ్యకర ఇబ్బందుల నుంచి తాను త్వరగా కోలుకుంటాననే ఆత్మవిశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. కేన్సర్ రావడానికి గల కారణాలపై సమాజాన్ని చైతన్యం చేస్తానని చెప్పారు. దీనితో బాధపడే వారిలో స్ఫూర్తి నింపుతానని హంసానందిని పేర్కొన్నారు. చాలా రోజుల పాటు తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం వల్ల తన ఇన్ బాక్స్ మొత్తం మెసేజీలతో నిండిపోయిందని, తన పట్ల కేర్ తీసుకుంటున్నందుకు, తనపై ప్రేమాభిమానాలను కురిపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

అనుమానాస్పదంతో తెరంగేట్రం..
ఇదివరకు సొనాలి బింద్రే కేన్సర్ బారిన పడ్డారు. మెటాస్టేటిక్ క్యాన్సర్‌తో చాలాకాలం పాటు బాధపడ్డారు. ట్రీట్‌మెంట్ తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. వెటరన్ దర్శకుడు వంశీ హంసానందినిని తెలుగుతెరకు పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం.. ఆమె తొలి చిత్రం. ఈ సినిమాలో ప్రతి దినం నీ దర్శనం.. పాట సూపర్ హిట్. ఇప్పటికీ అది వినిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత స్పెషల్ పాటల్లో నటించారు అవన్నీ సూపర్‌హిట్స్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా, శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన మిర్చీ మూవీలో టైటిల్ సాంగ్‌లో మెరుపులు మెరిపించారు హంసానందిని. ఆ తరువాత ఆమెకు చాలా అవకాశాలొచ్చాయి.












Click it and Unblock the Notifications