బొకే వద్దు మొక్కే ముద్దు: 'కుమారి ఎఫ్ 21' హీరోయిన్ హెబ్బా పటేల్ (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని ప్రెస్‌క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బొకే వద్దు మొక్కే ముద్దు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో 'కుమారి 21ఎఫ్' సినిమా యూనిట్ బృందం ప్రారంభించింది.

ఈ సందర్భంగా టాలీవుడ్ నటి, 'కుమారి ఎఫ్ 21' సినిమా హీరోయిన్ హెబ్బా పటేల్ 'బొకే వద్దు మొక్కే ముద్దు' అనే కార్యక్రమం చాలా వినూత్నంగా ఉందన్నారు. మొక్కల పెంపకాన్ని ప్రజల్లో అవగాహన కోసం మీడియా తరుపున ఇదో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు.

ఇకపై తాను ఎటువంటి ఫంక్షన్లు, ఈవెంట్స్‌కు హజరైనా బొకేకు బదులు మొక్కనే తీసుకుంటానని తన అభిమానులకు ఈ సందర్భంగా హెబ్బా పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అతిథులకు బొకేకు బదులు మొక్క ఇచ్చే విధానం ఎంతో బాగుందన్నారు.

రాబోయే తన తదుపరి చిత్రాల్లో ప్రచార కార్యక్రమాలలోనూ, సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ బొకేలకు బదులుగా మొక్కలను ఇస్తానని 'కుమారి 21 ఎఫ్' డైరెక్టర్ సూర్య ప్రతాప్ అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ హెబ్బా పటేల్, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి దీనికి సంబంధించిన టీషర్ట్‌లు, క్యాప్‌లను అందజేశారు.

ప్రెస్ క్లబ్ ఉత్సవాలను పురస్కరించుకుని వెయ్యి మొక్కలను సచివాలయంలోని అధికారులకు, మంత్రులకు, ఫిలిం, ఫెడరేషన్‌లో సినీ ప్రముఖులకు అందజేయనున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ బి. రాజమౌళి చారి, ట్రెజర్ పి.వి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు దుగ్గు రఘు, మారం శ్రీనివాస్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

'బొకే వద్దు మొక్కే ముద్దు'

'బొకే వద్దు మొక్కే ముద్దు'

నగరంలోని ప్రెస్‌క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బొకే వద్దు మొక్కే ముద్దు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో 'కుమారి 21ఎఫ్' సినిమా యూనిట్ బృందం ప్రారంభించింది.

 'బొకే వద్దు మొక్కే ముద్దు'

'బొకే వద్దు మొక్కే ముద్దు'

ఈ సందర్భంగా టాలీవుడ్ నటి, 'కుమారి ఎఫ్ 21' సినిమా హీరోయిన్ హెబ్బా పటేల్ 'బొకే వద్దు మొక్కే ముద్దు' అనే కార్యక్రమం చాలా వినూత్నంగా ఉందన్నారు. మొక్కల పెంపకాన్ని ప్రజల్లో అవగాహన కోసం మీడియా తరుపున ఇదో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు.

 'బొకే వద్దు మొక్కే ముద్దు'

'బొకే వద్దు మొక్కే ముద్దు'

ఇకపై తాను ఎటువంటి ఫంక్షన్లు, ఈవెంట్స్‌కు హజరైనా బొకేకు బదులు మొక్కనే తీసుకుంటానని తన అభిమానులకు ఈ సందర్భంగా హెబ్బా పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అతిథులకు బొకేకు బదులు మొక్క ఇచ్చే విధానం ఎంతో బాగుందన్నారు.

'బొకే వద్దు మొక్కే ముద్దు'

'బొకే వద్దు మొక్కే ముద్దు'

రాబోయే తన తదుపరి చిత్రాల్లో ప్రచార కార్యక్రమాలలోనూ, సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ బొకేలకు బదులుగా మొక్కలను ఇస్తానని 'కుమారి 21 ఎఫ్' డైరెక్టర్ సూర్య ప్రతాప్ అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ హెబ్బా పటేల్, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి దీనికి సంబంధించిన టీషర్ట్‌లు, క్యాప్‌లను అందజేశారు.

 'బొకే వద్దు మొక్కే ముద్దు'

'బొకే వద్దు మొక్కే ముద్దు'

ప్రెస్ క్లబ్ ఉత్సవాలను పురస్కరించుకుని వెయ్యి మొక్కలను సచివాలయంలోని అధికారులకు, మంత్రులకు, ఫిలిం, ఫెడరేషన్‌లో సినీ ప్రముఖులకు అందజేయనున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ బి. రాజమౌళి చారి, ట్రెజర్ పి.వి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు దుగ్గు రఘు, మారం శ్రీనివాస్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+