• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సంక్షోభంలో జంధ్యాల రవిశంకర్ ఎంట్రీ: ఉద్ధవ్ థాకరేతో కీలక భేటీ: షిండే వైపు హరీష్ సాల్వే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభం దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. తిరుగుబాటు వర్గానికి నాయకత్వాన్ని వహిస్తోన్న శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన వర్గానికి చెందిన శాసన సభ్యులపై అనర్హత వేటు వేయడాన్ని ఆయన సవాల్ చేశారు.. పిటీషన్ దాఖలు చేశారు. రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చారిందులో. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

 షిండే వర్గం తరఫున హరీష్ సాల్వే..

షిండే వర్గం తరఫున హరీష్ సాల్వే..

ఏక్‌నాథ్ షిండే వర్గం నుంచి రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీస్‌కు వ్యతిరేకంగా ఒకటి, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌధరిని అపాయింట్ చేయడానికి వ్యతిరేకంగా మరొకటి దాఖలయ్యాయి. ఈ ఉదయం 10:30 గంటలకు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్‌ను విచారించే అవకాశం ఉంది. ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే..ఏక్‌నాథ్ షిండే తరఫున విచారణకు హాజరు కానున్నారు.

 డిప్యూటీ స్పీకర్ తరఫున..

డిప్యూటీ స్పీకర్ తరఫున..


అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ, తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తమ వాదనలను వినిపించనున్నారు. ఈ మేరకు జంధ్యాల రవిశంకర్ ఆదివారం రాత్రి ముంబైలోని వర్షా బంగళాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుసుకున్నారు. ఈ పిటీషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్ధవ్ థాకరేతో కలిసి దిగిన ఫొటోను ఆయన తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

గవర్నర్ సమీక్ష..

గవర్నర్ సమీక్ష..

కరోనా వైరస్ బారిన పడ్డ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఇవ్వాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఆ వెంటనే రాజకీయ సంక్షోభంపై దృష్టి సారించారు. రెండు-మూడు రోజులుగా శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న దాడుల గురించి ఆరా తీశారు. దీనిపై ఆయన రాజ్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ముంబై సహా పుణే, రత్నగిరి, ఉస్మానాబాద్ వంటి పలు జిల్లాలు, తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే.

డీజీపీకి లేఖతో..

డీజీపీకి లేఖతో..

ఈ పరిణామాలను గవర్నర్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. సమీక్ష ముగిసిన వెంటనే డీజీపీ రజనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలకు వేర్వేరుగా లేఖలు రాశారు. 38 మంది శివసేన, ఇద్దరు ప్రహార్ జన్‌శక్తి పార్టీ, ఏడుమంది స్వతంత్ర ఎమ్మెల్యేలకు తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశించారు. వారి నివాసాలు, కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసుల వద్ద పోలీసు బలగాలను మోహరింపజేయాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులకూ భద్రత ఇవ్వాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

English summary
Advocate Jandhyala Ravi Shankar will appear for the Maharashtra Deputy Speaker, Narhari Zirwal, before the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X