కాలుష్యపు నురగ బీభత్సం: బెంగళూరు తర్వాత హైదరాబాదే!
గత రెండ్రోజులుగా కురిసిన వర్షానికి నగరంలోని పలు చెరువులు, మూసీ నదిలో భారీగా రసాయనాలు, వ్యర్థాలు చేరాయి.దీంతో అది భారీ ఎత్తున నురగగా మారి స్థానికులను ఆందోళనలకు గురిచేస్తోంది.
హైదరాబాద్: గత రెండ్రోజులుగా కురిసిన వర్షానికి నగరంలోని పలు చెరువులు, మూసీ నదిలో భారీగా రసాయనాలు, వ్యర్థాలు చేరాయి. దీంతో అది భారీ ఎత్తున నురగగా మారి స్థానికులను ఆందోళనలకు గురిచేస్తోంది.

రసాయనాల కాలుష్యం వల్లే..
రసాయనాలు, విష పదార్థాలు కలిసిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. కూకట్‌పల్లితోపాటు నెన్నాంపూర్ చెరువులో భారీగా నురగ చేరింది. ఇదంతా విపరీతమైన నీటి కాలుష్యం కారణంగానే జరిగిందని అధికారులు చెబుతున్నారు.

బెంగళూరులోనూ ఇలాగే..
ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి నురగే రోడ్లపైకి వచ్చి వాహనదారులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అక్కడ కూడా విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యమే కారణమని అధికారులు తెలిపారు.

ప్రజల ఆందోళన
కాగా, గురువారం, శుక్రవారం హైదరాబాద్‌లోని ధరణి నగర్‌లో విపరీతంగా చేరిన కాలుష్యపు నురగ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

తీవ్ర ఇబ్బందులు..
ఒక్కసారిగా నురగ నీటి కాలువల్లోంచి ఇళ్లవైపుగా దూసుకురావడంతో స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమల రసాయనాలు, వ్యర్థాలు చెరువులు, కాలువలు, మూసీ నదుల్లో చేరడం వల్లే ఇలా జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications