గాలి కూతురు పెళ్లి తర్వాత... ఇప్పుడు తెలంగాణలో ఖరీదైన పెళ్లి!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గత ఏడాది మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి చర్చనీయాంశమైంది. ఆయన తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేశారు. అంతకుముందే ఆయన ప్రింటి చేయించిన పెళ్లి కార్డ్ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. వివాహ ఆహ్వాన పత్రికలో వీడియో ఏర్పాటు చేశారు.

ఇప్పుడు తెలంగాణలో తెరాస నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ కొడుకు పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఆహ్వాన పత్రికలో వీడియో లాంటిది కాకపోయినప్పటికీ.. పెళ్లికి వేసుకు రావాల్సిన దుస్తులను ఆహ్వాన పత్రికలతో పాటు ఇస్తున్నారు. వాటితో పాటు ఓ కడియం కూడా ఇస్తున్నారు.

After Gali daughter's Marriage, Now TRS leader's son marriage.

అందుకే ఈ పెళ్లిని తెలంగాణలో అత్యంత ఖరీదైన పెళ్లిలా భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, తన వెన్నంటే ఉన్న రాములు నాయక్‌ను కేసీఆర్ ఎమ్మెల్సీగా చేశారు.

రాములు నాయక్ తన మూడో కొడుకైన జితేంద్ర నాయక్‌కు త్వరలో వివాహం చేయబోతున్నారు. అందరిలాగే తానూ చేస్తే గుర్తింపు ఏముంటుందనుకున్నారో ఏమో ఇలా వెరైటీగా ప్లాన్ చేశారు. అతిథులందరికీ ఆహ్వాన పత్రికలోనే పెళ్లికి వేసుకు రావాల్సిన దుస్తులు కూడా అందిస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ పింక్ పైజామా, రెడ్ బాటమ్‌తో పాటు లాల్చీను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీలందరి కొలతలను రాములు నాయక్ ముందుగానే తీసుకున్నారట. దుస్తులంతో పాటు ఓ వెండి కడియం కూడా ఆహ్వాన పత్రికలో ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After Gali daughter's Marriage, Now TRS leader's son marriage.
Please Wait while comments are loading...