మ‌ద్యం త‌ర్వాత కిక్కిచ్చేది గాంజాయే..! తెలంగాణ‌లో త‌గ్గి పోతున్న మ‌ద్యం ప్రియులు..!!

న్యూఢిల్లీ/హైద‌రాబాద్ : మ‌ద్యం వినియోగంలో తెలంగాణ ముందుగా ఉంటుంద‌ని, ఇన్నాళ్లూ తెలంగాణ ప్ర‌జ‌లు తాగుబోతులుగా అంబాడాలు మోపిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. కాని తెలంగాణ రాష్ట్ర ప్ర‌జానీకం అనుకున్నంత మ‌ద్యం ప్రియులు ఏమీ కాదు. మ‌ద్యం సేవించ‌డంలో తెలంగాణ క‌న్నా ముందు వ‌రుస‌లో ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అంటే తాగుబోతుల్లో తెలంగాణ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్నార‌ని రుజువ‌వుతోంది. దీంతో ఇన్నాళ్లూ తెలంగాణ ప్ర‌జ‌ల మీద ఉన్న అప‌వాదు పంటాపంచ‌లైన‌ట్టు లెక్క‌. ఇంత‌క తెలంగాణ లో మ‌ద్యం ప్రియులు త‌గ్గి పోవ‌డానికి కార‌ణం ఏంట‌ని ఎక్సైజ్ శాఖ ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టున‌ట్టు తెలుస్తోంది.

మ‌ద్యం లో కిక్కు వేర‌యా..! తర్వాతి స్థానం గంజాయిదే..!!

మ‌ద్యం లో కిక్కు వేర‌యా..! తర్వాతి స్థానం గంజాయిదే..!!

ఇక మ‌ద్యం కిక్కులో తేలి తూలే వాళ్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా గంజాయి అందుబాటులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌ద్యం తో విసిగిపోయి, మ‌త్తులో ఉండాల‌నుకునే వాళ్లు మాత్రం పెద్ద‌మొత్తంలో గంజాయి ని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ స‌ర్వే ద్వారా నిరూపిత‌మౌతోంది. గంజాయి, బ్రౌన్ శుగ‌ర్ వంటి మాద‌క ద్ర‌వ్యాల మీద నిషేదం ఉన్న‌ప్ప‌టికి మ‌త్తులో తేలాల‌నుకునే వాళ్ల‌కు చిటుక్కున అందుబాటులో ఉంటాయి. ఐతే మ‌ద్యం త‌ర్వాత ఎక్కువ‌గా సేవించేది గాంజాయ‌ని తేలిపోయింది.

 సామాజికన్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ సర్వే..! న‌ల్ల‌మందుకు బానిస‌లౌతున్న‌ ప్ర‌జ‌లు..!!

సామాజికన్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ సర్వే..! న‌ల్ల‌మందుకు బానిస‌లౌతున్న‌ ప్ర‌జ‌లు..!!

జాతీయ స్థాయిలో 14.6 శాతం (16 కోట్ల మంది) మద్యం సేవించేవారు ఉన్నారని ఓ సర్వే ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది. మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని సర్వేకోసం ప్రామాణికంగా తీసుకున్నారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు చికిత్స పొందుతున్నారు.

 పెరిగిపోతున్న ప‌బ్ క‌ల్చ‌ర్..! మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌ల‌వుతున్న యువ‌త‌..!!

పెరిగిపోతున్న ప‌బ్ క‌ల్చ‌ర్..! మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌ల‌వుతున్న యువ‌త‌..!!

ప్రతి 180 మందిలో ఒకరు ఏదో ఒక సమయంలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారే. 15ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్‌ ఆధ్వర్యంలోని ఎన్‌డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం- సాధికారత శాఖ ఈ సర్వే చేసింది. ‘గతంలో 2001లోనూ సర్వే చేసి 2004లో ఫలితాలను ప్రకటించినా, అది రాష్ట్రాల వారీగా పూర్తి గణాంకాలను సమర్పించలేదు. అయితే ప్రస్తుత సర్వే దేశంలో గణనీయమైన స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని తెలుపుతోంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉందని కూడా తేల్చింది.

త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువు కిక్కు..! గంజాయి తాగి ఊగిపోతున్న వైనం..!!

త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువు కిక్కు..! గంజాయి తాగి ఊగిపోతున్న వైనం..!!

వయోజనుల్లో ఈ రుగ్మతల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే స్పష్టం చేసింది' అని నివేదిక తయారుచేశాం' అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ చెప్పారు. జాతీయ స్థాయిలో 186 జిల్లాలలో ఈ సర్వే చేశారు. దేశ జనాభాలో 2.8 శాతం (దాదాపు మూడు కోట్లు) గత 12 నెలల కాలంలో తాము గంజాయి లాంటి మత్తు పదార్థాలను రుచిచూశామని చెప్పారు. సాధారణ మత్తు మందు ఉపయోగించే వారి సంఖ్య 1.14 కాగా, ఔషధ మత్తు మందులు (వైద్యులు చెప్పిన పరిమితికన్నా ఎక్కువ) ఉపయోగించే వారు 0.96 శాతం. 0.52 శాతం ప్రజలు సాధారణంగా లభించే నల్లమందును వాడుతున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+