హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు భారీ షాక్, పార్టీలో కుదుపు తప్పదా: కేబినెట్లోవాళ్లా..నాయిని తర్వాత శ్రీనివాస్ గౌడ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్‌కు భారీ షాక్ ! నాయిని తర్వాత శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..!

హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ కేబినెట్‌పై గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు అవి కలకలం రేపుతుండగానే, తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయనను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. నాయిని వ్యాఖ్యలు వంద శాతం నిజమని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారని చెప్పారు. అది తలుచుకుంటే తన కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కేసీర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందని చెప్పారు. ఉద్యోగులు లేనిదే సకల జనుల సమ్మె లేదని చెప్పారు.

 నిన్న హోంమంత్రి ఇలా

నిన్న హోంమంత్రి ఇలా

నాడు సీఎం కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కేబినెట్లో ఉన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిట్టినోళ్లు, తిట్టనోళ్లు ప్రస్తుతం ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ నామరూపాలు లేకుండా చేయడానికే ఆ పార్టీకి చెందిన వారిని తెరాసలో చేర్చుకున్నామని కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు.

 కేసీఆర్‌కు తలనొప్పి

కేసీఆర్‌కు తలనొప్పి

ఓ వైపు నాయిని మాటలు కలకలం రేపుతుండగానే మరుసటి రోజే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హోంమంత్రి మాటలు వంద శాతం నిజమని చెప్పారు. ఉద్యమంతో సంబంధం లేని వారు మంత్రివర్గంలో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతలు, కేబినెట్ మంత్రులు వరుసగా ఇలా వ్యాఖ్యలు చేయడం కేసీఆర్‌కు తలనొప్పి అని చెప్పవచ్చు.

 ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు

ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీలో ఉండి, ఆ తర్వాత తెరాసలో చేరిన మంత్రులు అయిన నేతలు పలువురు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగెశ్వర రావు, మహేందర్ రెడ్డి తదితరులు కొందరు ఉన్నారు. వీరిలో ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ సాగుతోంది.

 అందుకే ఇలా మాట్లాడుతున్నారా

అందుకే ఇలా మాట్లాడుతున్నారా

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పార్టీలో చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు తెరాస నేతలకు అప్పుడప్పుడు విపక్షాల నుంచి ఇరుకున పడే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాడు తెలంగాణ కోసం పోరాడిన వారికి పదవులు కట్టబెట్టారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ అసంతృప్తి ఉంది. ఇది గమనించి వారు ఇలా వ్యాఖ్యానించి ఉంటారా అనే చర్చ సాగుతోంది.

 తెరాసలో కుదుపు వస్తుందా

తెరాసలో కుదుపు వస్తుందా

నిన్న నాయిని, నేడు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు ఓ విధంగా టీఆర్ఎస్‌కు గట్టి షాక్ అని చెప్పవచ్చు. అనుకోకుండా మాట్లాడినా, ఎలా మాట్లాడినా వీరి వ్యాఖ్యలు తెరాసలో కుదుపు తీసుకు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు తెరాసలో అంతర్గత గొడవకు కూడా అద్దం పడుతున్నాయని చెప్పవచ్చునని అంటున్నారు.

English summary
After Nayini Narsimha Reddy, Now MLA Srinivas Goud sensational comments on Telangana Chief Minister KCR's cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X