కవితకు కేఏ పాల్ బంపర్ ఆఫర్..! ఆ ఉపఎన్నికల్లో టికెట్ ..!
బీఆర్ఎస్ తో విభేదాల నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా సమర్పించిన కల్వకుంట్ల కవిత భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఆమె సొంత పార్టీ స్థాపించేందుకు సిద్దమవుతున్నారని, ఇప్పటికే పేరు, ఇతర వివరాలు ఖరారు అయ్యాయని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఇతర పార్టీల్లో చేరేది లేదని కూడా కవిత ప్రకటించడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇలాంటి సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కవితకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ప్రకటించారు. తన పార్టీలో చేరితే త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోరాడుదామని ఆయన సూచించారు. నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలని కేఏ పాల్ తెలిపారు. ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలని ఆమె కవితనుద్దేశించి వ్యాఖ్యానించారు.

కవిత ప్రస్తుతం బీసీల కోసం పోరాడానని చెప్తున్నారని, కాబట్టి బీసీల కోసమే పనిచేస్తున్న ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆమెకు కేఏ పాల్ సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని, పోటీ చేసి గెలిచి తానేంటో నిరూపించుకునే అవకాశం ఆమెకు లభిస్తుందని కేఏ పాల్ తెలిపారు. బీజేపీ ఆరెస్సెస్ బ్రాహ్మణుల పార్టీ అని రామచంద్రరావు చెప్తున్నారని, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని 12 ముఖ్యమంత్రుల్ని చూస్తేనే తెలుస్తుందన్నారు. కాబట్టి బీసీల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరి గెలిచి అందరి మనుసుల్నీ గెలుద్దామని సూచించారు.












Click it and Unblock the Notifications