ధర్నాకు గైరాజర్: ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతారా, ఆమె ఏం చెప్పారంటే?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టిడిపి నేతల్లో మరోసారి విబేధాలు బహిర్గతమయ్యాయి. టిడిపిలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాలకు మధ్య కొంత కాలంగా అంతరం నెలకొంది.
నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టిడిపి నేతల్లో మరోసారి విబేధాలు బహిర్గతమయ్యాయి. టిడిపిలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాలకు మధ్య కొంత కాలంగా అంతరం నెలకొంది. సోమవారం నాడు నల్గొండ కలెక్టరేట్ వద్ద జరిగిన రైతుల ఆందోళన కార్యక్రమానికి ఉమా మాధవరెడ్డి హజరుకాలేదు.అయితే కొంత కాలంగా ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. అయితే గతంలో పలుమార్లు ఇతర పార్టీల నుండి చేరాలని ఆహ్వనాలు వచ్చినా తాను చేరలేదని చెప్పారు. అయితే టిఆర్ఎస్ నుండి ఆహ్వనం వస్తే ఆ పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని ప్రకటించడం కూడ ఆమె పార్టీ మారుతారనే సంకేతాలను ఇచ్చినట్టైదంటున్నారు విశ్లేషకులు.
Recommended Video

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ ఇచ్చినందునే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని, తనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఇంతవరకు స్పష్టమైన హమీ రాలేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ వస్తే రేవంత్‌తో పాటే తాను కూడ రాహుల్‌గాంధీని కలిసేందుకు వెళ్ళేదాన్నని ఆమె గుర్తు చేశారు.
2014 ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వనాలు వచ్చాయని కూడ ఉమా మాధవరెడ్డి చెప్పారు. కానీ, ఆనాడు టిడిపిని వదలలేదన్నారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వనాలు వస్తే ఆలోచిస్తానని ఆమె తాజాగా ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

ధర్నాకు గైరాజరైన ఉమా మాధవరెడ్డి
రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ నల్గొండ కలెక్టరేట్ ఎదుట నవంబర్ 20వ, తేదిన టిడిపి ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు తదితర నేతలు పాల్గొన్నారు. అయితే ఈ ధర్నాకు మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి మాత్రం హజరుకాలేదు. అయితే పార్టీలో కొంతకాలంగా మాజీమంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాలకు మధ్య అంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఉమా మాధవరెడ్డి వర్గీయులు ఈ ధర్నాకు హజరుకాలేదని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీ మారేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ ధర్నాకు హజరుకాకపోవడం కూడ చర్చనీయాంశంగా మారింది.

కెసిఆర్‌ను ఉమా మాధవరెడ్డి మరోసారి కలిశారా
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తెలంగాణ సీఎం కెసిఆర్‌ను అసెంబ్లీలోనే కలిశారు. మావోయిస్టుల చేతిలో మరణించిన కుటుంబాలకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ ఆమె సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ఆమె సీఎంను కలిసే సమయంలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడ ఉన్నారు. అయితే అదే సమయంలో నల్గొండ కలెక్టరేట్ వద్ద టిడిపి ధర్నాలో పాల్గొనకుండా ఉమా మాధవరెడ్డి సీఎంను కలిసేందుకు వెళ్ళారనే ప్రచారం కూడ జిల్లాలో సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఉమా మాధవరెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీలోనే కొందరు నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం.

టిఆర్ఎస్‌లో చేరితే ఎక్కడి నుండి పోటీ
ఉమా మాధవరెడ్డి భువనగిరి నుండి 2003 నుండి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2014 ఎన్నికల్లోనే ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరితే ఆమెకు ఎక్కడ నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించనుందోననే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఇదే విషయాలను ఉమా మాధవరెడ్డి ప్రస్తావించారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుతం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ లేరు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరితే టిక్కెట్టు విషయమై స్పష్టత లేదంటున్నారు.ఈ కారణంగానే ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటున్నారు.ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతారానే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ వార్తలను ఆమె ఖండిస్తున్నారు.

ఉమా మాధవరెడ్డగి పయనమెటు
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆమె టిడిపిలోనే కొనసాగుతారా, ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటారా అనే చర్చ సాగుతోంది. అయితే నల్గొండ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు ఆమె గైరాజర్ కావడంపై కూడ పార్టీలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే గ్రూపు విబేధాల కారణంగానే ఉమా మాధవరెడ్డి ధర్నాకు హజరుకాలేదా ఇంకా ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications