ఇప్పుడు విధ్వంసం జరగదు: ఆపరేషన్ గరుడపై నటుడు శివాజీ, 'పొలిటికల్ థియరీస్‌ను సినిమాటిక్‍గా'
హైదరాబాద్: దక్షిణాదితో పాటు ఆంధ్రప్రదేశ్ టార్గెట్‌గా ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పిన నటుడు శివాజీ తాజాగా మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ పైన తాను చేసిన ప్రకటన తనకు వ్యక్తిగతంగా వచ్చిన సమాచారం అని చెప్పారు. ప్రత్యేక హోదా పోరాట సమితికి ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్లు వాళ్ల అజెండాలతో ముందుకు పోతున్నారని చెప్పారు.

ఇప్పుడు ఆ విధ్వంసం జరగదు
సదరు జాతీయ పార్టీ ఆపరేషన్‌ను తొలుత తాను కూడా నమ్మలేదని, ఏ తప్పు చేయాలన్నా దాని నుంచి బయటపడటానికి మార్గాలు ఉన్నాయని శివాజీ చెప్పారు. అలాంటిదే ఈ ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ గురించి బయటకు తెలియకుంటే కచ్చితంగా జరిగేదేనని, ఇప్పుడు జరగడానికి వీల్లేదన్నారు. ఆ విధ్వంసం జరగదన్నారు.

ఉండవల్లికి శివాజీ కౌంటర్
శివాజీ ఆపరేషన్ ద్రవిడపై వైసీపీ నేత విజయ సాయి రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు విమర్శించారు. ఉండవల్లి వ్యాఖ్యలకు శివాజీ స్పందించారు. తాను రాష్ట్రం కోసం పని చేస్తున్నానని ఉండవల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ ద్రవిడపై ఉండవల్లికి ఉలుకెందుకని, ఆయనను గత పన్నెండేళ్లుగా తాను గమనిస్తున్నానని, ఏ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండకూడదనేదే ఉండవల్లి ఉద్దేశ్యమని తనకు అనిపిస్తోందన్నారు. వారు ఓ పక్క ఉంటారని, మరొకరిపై నిందలు వేస్తుంటారన్నారు.

మేం చెబితే పిచ్చి మాటలా
ఉండవల్లి చెబితే భగవద్గీత, మేం చెబితే పిచ్చిమాటలా అని శివాజీ మండిపడ్డారు. ఉండవల్లి తమ బెనిఫిట్స్ కోసం ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దన్నారు. తనకు లాభాలు కావాలనుకుంటే ఏదో రాజకీయ పార్టీలో ఉండేవాడినని, బీజేపీ నుంచి బయటకు వచ్చేవాడిని కాదన్నారు. ఆపరేషనా.. గాడిదగుడ్డా అని ఉండవల్లి అన్నారని, అలా అయితే ఉండవల్లి చెప్పేవన్నీ నేను అబద్దాలని చెబుతానని, మీరు ఎప్పుడు ఏం మాట్లాడారో అన్నీ ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ ద్రవిడ
కాగా, శివాజీ చేసిన ఆపరేషన్ ద్రవిడ ఆరోపణలపై బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఆయన ఏపీ డీజీపీ మాలకొండయ్యను కలిశారు. శివాజీ ఆపరేషన్ ద్రవిడ అంటూ ఓ వీడియో విడుదల చేశారని దాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు.

కొందరు నటులు పొలిటికల్ థియరీస్‌ను సినిమాటిక్‌గా
ఇటీవల సినీ నటులు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఈ చర్యలను సినీ రచయిత కోన వెంకట్ తప్పుబట్టారు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... కొందరు సినీ నటులు కొన్ని పొలిటికల్ థియరీస్‌ను సినిమాటిక్‌గా చెబుతున్నారని విమర్శించారు. స్టుపిడ్‌గా అనిపించే విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిజమైన రాజకీయ నేతలను అటాక్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. విమర్శలు చేస్తున్న సినీ నటుల ఆలోచనా విధానంలో మరింత ప్రాక్టికాలిటీ ఉంటే అభినందించేవాడినన్నారు. ఇలాంటి విమర్శలు మానేసి ప్రజలు, వారి సమస్యలపై దృష్టి సారించండి బ్రదర్స్ అని హితవు పలికారు.












Click it and Unblock the Notifications