అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా, ఒకరు మృతి (ఫోటోలు)
హైదారాబాద్: అగ్రిగోల్డ్ సంస్ధపై విజయవాడలో వెల్లువెత్తిన నిరసన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న బాధితులు మంగళవారం సోమాజిగూడలోని సంస్ధ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నా వారికి అక్కడ ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ఏజెంట్లు, కస్టమర్లు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉదయం అక్కడికి చేరుకున్న బాధితులు దాదాపు మధ్యాహ్నాం వరకు అదే ప్రాంతంలో వేచి ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తలపెట్టని ఈ ఆందోళనకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మద్దతు తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా, ఒకరు మృతి
అక్కడికి వచ్చిన ఆయన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ సంస్ధ లక్షల మందిని రోడ్డున పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా, ఒకరు మృతి
ఈ విషయంపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్లు చెప్పారు. అగ్రిగోల్డ్ సంస్ధ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా, ఒకరు మృతి
ఇక విశాఖలో ఓ అగ్రిగోల్డ్ బాధితుడు మృతి చెందాడు. పదేళ్లపాటు అగ్రిగోల్డ్‌లో దాచిన సొమ్ము చేతికి రాకపోవడంపై మంచం పట్టిన పరిడాల చిట్టిబాబు (55) కన్ను మూశారు.

అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా, ఒకరు మృతి
అరకులోయ మండలం సంతబయలుకు చెందిన ఈయన మంగళవారం విశాఖపట్నానికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు.












Click it and Unblock the Notifications