తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు- పార్టీ వీడే ఆలోచన చేస్తే హైకమాండ్ ఖబడ్దార్
హైదరాబాద్: తెలంగాణలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో భారతీయ జనతా పార్టీ చతికిల పడింది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. వంటి సీనియర్ల చేరికతో కాంగ్రెస్ పార్టీలో ఊపు కనిపిస్తోండగా బీజేపీ పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. ఊసూరుమంటోంది. అంతర్గత కుమ్ములాటలతో తన భస్మాసుర హస్తం తన నెత్తినే పెట్టుకుంటోంది.
ఇది కాస్తా- బీజేపీ నాయకుల్లో తీవ్ర అసహనానికి దారి తీస్తోంది. తనకు అలవాటైన రీతిలో ఇక బెదిరింపు రాజకీయాలకు తెర తీసేలా కనిపిస్తోంది. పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్న నాయకులపై దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తామనే హెచ్చరికలను బీజేపీ పంపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ పరణామాలను కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకుంటోంది. సమయానుకూల నిర్ణయాలతో ఎన్నికల రణరంగానికి కాలు దువ్వుతోంది.

మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తినకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. పార్టీలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ వారు జేపీ నడ్డా వద్ద ఏకరువు పెట్టారు. కాంగ్రెస్‌లోకి చేరాలంటూ తమ అనుచరులు, మద్దతుదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందంటూ వారు కుండబద్దలు కొట్టారు.
తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను వారు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. సొంత పార్టీ నేతలే దీన్ని అడ్డుకుంటోన్నారని, ఆధిపత్య ధోరణితో పరస్పరం కుమ్ములాటలకు పాల్పడుతున్నారంటూ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సొంత నిర్ణయాలతో ఆయన పార్టీని దిగజార్చుతున్నట్లు ఫిర్యాదు చేశారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను చులకన చేస్తున్నారని, తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారని, ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బండి సంజయ్.. ఏకపక్షంగా వ్యవహరిస్తోండటం పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాలపై తమకు ఎలాంటి సమాచారం ఉండట్లేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను బండి సంజయ్ ముందుచూపు లేమి వల్ల కోల్పోవాల్సి వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల.. జేపీ నడ్డా ముందు స్పష్టం చేశారని అంటున్నారు. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవకాశాలను పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.

చేరికల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది బీజేపీకి. పార్టీలో చేరే వారికి ఎప్పుడో తెర పడింది. అదే సమయంలో కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు సీనియర్లు. బీజేపీ నేతలను కాంగ్రెస్‌లో చేరాలంటూ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కావడానికి ఈ ఒత్తిడే కారణం అనేది బహిరంగ రహస్యమే.
పార్టీ వీడే ఆలోచన చేస్తే సహించేది లేదని పార్టీ అధినాయకత్వం హెచ్చరించినట్లు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. పార్టీని బతికించమని అడిగితే హెచ్చరికలు చేయడం సహేతుకంగా లేదని తేల్చి చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లో వలసలు పెరగడం.. రాష్ట్రస్థాయి బీజేపీ నేతలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. తాము త్వరపడకపోతే మున్ముందు నష్టపోతామనే ఆందోళన వారిలో నెలకొంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications