కొండా సురేఖ సంచలన నిర్ణయం: మంత్రి పదవి.. పార్టీకి రాజీనామా..!?

కొండా సురేఖకు బిగ్ షాక్. తాజా వివాదం వేళ సురేఖ ను మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశించినట్లు సమాచారం. ఈ సాయంత్రం లోగా రాజీనామా చేయకుంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో.. సురేఖ తన మద్దతు దారులు.. ముఖ్య అనుచరులతో సమావేశం అవుతున్నారు. రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం లోగా సురేఖ తన రాజకీయ భవితవ్యం పైన కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ వేదికగా సురేఖ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. సురేఖ సైతం పార్టీ చీఫ్ ఖర్గేతో సమావేశం అయి తన వాదన వినిపించారు. అక్కడే తన పైన పార్టీ మూడ్ ఏంటో సురేఖకు స్పష్టత వచ్చింది. ఆ తరువాత సీఎం రేవంత్.. మంత్రులే లక్ష్యంగా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు.

aicc-chief-kharge-suggested-konda-surekha-to-resign-for-cabinet-before-today-evening-as-reports-he

తన పైన చర్యలు తీసుకోవాలంటే ముందుగా రేవంత్ పైనా చర్యలు తీసుకోవాలని.. పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి సతీమణి పైన వచ్చిన ఆరోపణల సంగతి ఏంటని ప్రశ్నించారు. బీసీ కార్డును తెర మీద కు తీసుకొచ్చారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్పారు. దీంతో, సురేఖ ఇప్పుడు తన కీలక మద్దతు దారులతో సమావేశం అవుతున్నారు. మంత్రి పదవికి ఖర్గే ఆదేశాల మేరకు రాజీనామాకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

 హైకమాండ్ మూడ్ క్లియర్, కొండా సురేఖ ప్లాన్ బీ - రాజగోపాల్ రెడ్డి సైతం..!?
హైకమాండ్ మూడ్ క్లియర్, కొండా సురేఖ ప్లాన్ బీ - రాజగోపాల్ రెడ్డి సైతం..!?

మద్దతు దారులతో సమావేశం.. కీలక నిర్ణయానికి సిద్దం..?

ఇదే అంశం పైన మద్దతు దారులతో చర్చించనున్నారు. మంత్రి పదవి నుంచి తప్పించటం పైన సురేఖ ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. మంత్రి పదవితో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మద్దతు దారులతో సమావేశం తరువాత దీని పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ రానున్నారు.

సాయంత్రం లోగా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ప్రకటన చేయకుంటే.. గవర్నర్ కు నేరుగా సురేఖ బర్తరఫ్ పైన సీఎం లేఖ పంపటం ఖాయం అని పార్టీ వర్గాల సమాచారం. దీంతో.. ఇప్పుడు సురేఖ మంత్రి పదవికి రాజీనామా తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏంటి అనేది ఆసక్తి కరంగా మారుతోంది. సాయంత్రం లోగా తన పదవులకు రాజీనామా పైన కొండా సురేఖ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+