పార్టీ విధేయత: దానం నాగేందర్‌ను ప్రశంసించిన డిగ్గీ రాజాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రలోభాలకు లొంగకుండా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నందుకు మాజీ మంత్రి దానం నాగేందర్‌ను కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, వచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై అధిష్టానం పెద్దలు సమీక్ష నిర్వహించారు.
ఎఐసిసి కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం కావడానికి ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (టిపిసిసి) నాయకులు గులాం నబీ ఆజాద్, మోతిలాల్ వోరా, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేదిలను కలిశారు. అధికార టిఆర్ఎస్ పార్టీ పెట్టిన ఆశలకు లొంగకుండా పార్టీలోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకున్నందుకు ద్వివేది దానం నాగేందర్ భుజం తట్టారు

అంతేకాకుండా నగర కాంగ్రెసు పార్టీలో శిఖరప్రాయమైన నేతగా దానం నాగేందర్‌ను ఢిల్లీ పెద్దలు ప్రశంసిస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత టిపిసిసి నేతలతో దిగ్విజయ్ సింగ్ సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు.
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అవకాశాలపై డిగ్గీ రాజా ఆరా తీశారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications