కవితకు AIFB ఊహించని ట్విస్ట్- గెలిచిన తరువాత కొత్త రూటులో..!!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం నమోదు చేసుకుంటోంది. బీఆర్ఎస్, బీజేపీ నామమాత్రం గా మారాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన AIFB తో జత కట్టి.. ఆ పార్టీ గుర్తు పైన పోటీ చేసిన కవిత కు ఇప్పుడు వారి వైఖరి సమస్యగా మారుతోంది. వడ్డేపల్లి లో గెలిచిన AIFB ఇప్పుడు తమకు కవితతో సంబంధం లేదంటున్నారు. దీంతో.. ఇప్పుడు కవిత ఏం చేస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

తెలంగాణలో 116 మున్సిపల్, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లుగా కౌంటింగ్ మొదలైన సమయం లో కనిపించినా... తరువాత సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధిస్తోంది. అందులో భాగంగా మొత్తం 116 మున్సిపాల్టీల్లో 90కి పైగా కాంగ్రెస్ కు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఏడు కార్పోరేషన్లలో అయిదు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. అనూహ్యంగా బీజేపీ కరీంనగర్ కార్పోరేషన్ గెలుపు దిశగా వెళ్తోంది. బీఆర్ఎస్ కు ఒక్కటీ దక్కలేదు. ఇతరులు మరో కార్పోరేషన్ గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. భైంసా మున్సిపాల్టీని ఎంఐఎం గెలుచుకుంటోంది. మెదక్ మినహా పలు జిల్లాల్లో మెజార్టీ మున్సిపాల్టీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాల్టీలు.. బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యతలో ఉన్నారు.

aifb-sensational-statement-after-winning-in-vaddepalli-municipality-with-the-support-jagruthi-kavith

కవితతో సంబంధం లేదంటూ

కాగా, ఇక అయితే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపిన ఫార్వర్డ్‌ బ్లాక్‌.. 10 వార్డులకు గానూ ఏకంగా 8 వార్డులు కైవసం చేసుకుంది. దీంతో మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ సొంతమైంది. మరో రెండు స్థానాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో స్థానం చొప్పున వడ్డేపల్లిలో గెలుచుకున్నాయి. అయితే... ఇక్కడే కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మున్సిపాల్టీ గెలిచిన AIFB నేతలు తమకు కవితతో సంబంధం లేదని ఇస్తున్న స్టేట్మెంట్లు సంచలనంగా మారాయి.

తమను చూసి మాత్రమే ప్రజలు ఓటు వేసారని AIFB నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కవిత రాజకీయంగా బలోపేతం కావాలని డిసైడ్ అయ్యారు. కొత్త పార్టీ దిశగా కసరత్తు చేసారు. మున్సిపల్ ఎన్నికలు రావటంతో AIFB తో జత కట్టారు. తన మద్దతు దారులను AIFB గుర్తు పై పోటీకి దింపారు. వడ్డేపల్లి మున్సిపాల్టీ విజయం సాధించారు. ఇప్పుడు ఆ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్న వేళ.. కవిత ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+